తెల్లారగానే టిఫిన్ స్టాల్‌కు లెక్కలేనన్ని పార్శిళ్లు.. వాటిని తెరిచి చూడగా దిమ్మతిరిగింది!

విశాఖపట్నం జిల్లాలోని కొత్తపాలెంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు భారీస్థాయిలో గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం నుంచి పెద్దఎత్తున గంజాయిని కొనుగోలు చేసి.. స్థానికంగా పార్శిళ్ల రూపంలో విక్రయాలు చేస్తున్న సంతోశ్‌, పైడిరాజు, మౌళి, గణపతి, నూకేశ్‌ అనే ఐదుగురు వ్యక్తులను.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..!

తెల్లారగానే టిఫిన్ స్టాల్‌కు లెక్కలేనన్ని పార్శిళ్లు.. వాటిని తెరిచి చూడగా దిమ్మతిరిగింది!

|

Updated on: Mar 30, 2024 | 9:06 PM

విశాఖపట్నం జిల్లాలోని కొత్తపాలెంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు భారీస్థాయిలో గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం నుంచి పెద్దఎత్తున గంజాయిని కొనుగోలు చేసి.. స్థానికంగా పార్శిళ్ల రూపంలో విక్రయాలు చేస్తున్న సంతోశ్‌, పైడిరాజు, మౌళి, గణపతి, నూకేశ్‌ అనే ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో సంతోశ్ బైలపూడి గ్రామానికి.. గుమ్మాల పైడిరాజు, ఎర్రా మౌళి పూర్ణామార్కెట్‌‌కు, నారికేళం గణపతి సీతమ్మధారకు, రాపేటి నూకేశ్‌ కొత్తపాలెంకు చెందినవారుగా గుర్తించారు. వీరంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. కొత్తపాలెంలోని నూకేశ్ బంధువు నిర్వహిస్తున్న టిఫిన్ స్టాల్‌లో నిల్వ చేశారు. పక్కా సమాచారంతో ఆ షాపుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేయగా.. సుమారు 110 కిలోల గంజాయి పట్టుబడింది. వారు ఆ గంజాయిని గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుల దగ్గర నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారును సీజ్‌ చేశామన్నారు పోలీసులు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు డీసీపీ.

Follow us