Traffic Rules: వాహనదారులకు అలర్ట్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ రిమానాలు.. ఎప్పటి నుండి అంటే..?
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియమాలు కొత్తవేం కాకపోయినా వాటిని మరింత కఠినంగా అమలుచేయాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు నిర్ణయించారు. అప్పుడే వాహన వినియోగదారుల ప్రవర్తనలో మార్పు వస్తుందని,
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియమాలు కొత్తవేం కాకపోయినా వాటిని మరింత కఠినంగా అమలుచేయాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు నిర్ణయించారు. అప్పుడే వాహన వినియోగదారుల ప్రవర్తనలో మార్పు వస్తుందని, తద్వారా నగర రహదారులు అందరికీ సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. నవంబరు 21న రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్‌కు సంబంధించిన పలు సమస్యలను అధికారులతో సమీక్షించిన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవి రంగనాథ్ ఈ నిర్ణయానికి వచ్చారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు వ్యతిరేకంగా ట్రాఫిక్ అథారిటీ తన కొత్త డ్రైవ్‌ను కూడా ప్రారంభించింది.ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు పాల్పడితే.. రాంగ్ డ్రైవింగ్‌కు1, 700, ట్రిపుల్ రైడింగ్‌కు 1, 200 రూపాయలు జరిమానా విధించాలని ఆయన ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 28 నుంచి ట్రాఫిక్ నియమాలు కఠినంగా అమలవుతాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా జరిగే ప్రాంతాల ఆధారంగా జరిమానా విధిస్తామని, రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు ప్రధాన కారణమైన యు-టర్న్‌లను సమీక్షించి తగిన సవరణలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ జరిమానా ప్రభుత్వానికి సులువైన ఆదాయ మార్గం అనే సోషల్ మీడియా గాసిప్ అబద్ధమని.. అది నిబంధనలను కఠినంగా అమలు చేయడం కోసం, వాహన వినియోగదారుల ప్రవర్తనలో మార్పును తెచ్చేందుకు ఓ వ్యూహం మాత్రమేనని రంగనాథ్ అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

