మామిడి పూతతో ఎన్ని లాభాలో తెలిస్తే షాకవుతారు..వీడియో
వేసవి సీజన్‌లో వచ్చే మామిడి పండ్లంటే ఇష్టపడనివారుండరు. అందులోనూ ఫలరాజం అని పేరుగాంచిన ఈ పండు పేరుతగ్గట్టే రుచిలోనూ రారాజే. ఈ సీజనల్ ఫ్రూట్ అందానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతారు. ఈ మామిడిపండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తప్పక తినాలంటారు పోషకాహార నిపుణులు. అయితే మామిడి పండులోనే కాదు.. దీని ఆకులు, బెరడు, మామిడి పువ్వు, మామిడి టెంక, అన్నిటిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయని చెబుతారు.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మామిడిపువ్వును అనేక రకాలుగా ఉపయోగించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.మామిడి పువ్వులో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. దీంతో డయాబెటిస్ ముప్పు రాకుండా కాపాడుకోవచ్చు. ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. మామిడి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు మంట, వాపు వంటి సమస్యలు తగ్గిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం :
గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్
కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. RC 16 టైటిల్ ఇదే!
మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్ వీడియో
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము
కాకినాడలో భారీ స్కామ్..ఏకంగా కోట్ల విలువ చేసే..
ఇంకో అడుగు ముందుకెళితే అంతే

