Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'RRR' చూసి తెలుగు నేర్చుకున్న జపాన్‌ మహిళ.. NTR రియాక్షన్ ఇదే  వీడియో

‘RRR’ చూసి తెలుగు నేర్చుకున్న జపాన్‌ మహిళ.. NTR రియాక్షన్ ఇదే వీడియో

Samatha J

|

Updated on: Apr 02, 2025 | 4:14 PM

గ్లోబల్‌ స్టార్‌ జూనియర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవ‌ర ప్రమోష‌న్స్‌లో బిజిగా ఉన్నారు. ఈ మూవీ జ‌పాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మూవీ ప్రమోష‌న్స్ కోసం జ‌పాన్ వెళ్ళారు తారక్‌. ప్రమోష‌న్స్ అనంత‌రం అభిమానుల‌ను క‌లుసుకున్న తార‌క్‌కి ఒక లేడి అభిమాని షాక్ ఇచ్చింది. ఆమె తార‌క్ వ‌ద్దకి వ‌చ్చి..తార‌క్ అన్న నేను ఆర్ఆర్ఆర్ సినిమా చూసి తెలుగు నేర్చుకున్నాను. నేను మీతో తెలుగులో మాట్లాడాల‌ని రెండేళ్లుగా ఈ తెలుగు బుక్‌ని ప‌ట్టుకుని తిరుగుతున్నాను.

మీరు నా లైఫ్‌కి ఇన్‌స్పిరేషన్‌.. అని తెలుగులో చెప్పింది. దాంతో ఆశ్చర్యపోతూ.. మీరు మా అందరికీ పెద్ద స్ఫూర్తి అంటూ ఆ అభిమానికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. ఆ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌.. తాను జ‌పాన్ వెళ్లిన ప్రతిసారి తనకు అందమైన జ్ఞాపకాలను అందిస్తుందని, ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఒక జపనీస్ అభిమాని తనతో “RRR” సినిమా చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పడం తనను ఎంతగానో కదిలించిందన్నారు. ఒక విధంగా ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. వివిధ సంస్కృతుల మ‌ధ్య వార‌ధిగా ఉన్న సినిమా… భాష‌ను నేర్చుకునేలా చేయ‌డాన్ని సినిమా అండ్ భాషా ప్రేమికుడిగా తాను ఎప్పటికీ మర్చిపోలేని విషయం అంటూ తార‌క్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్‌

కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో

రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది.. RC 16 టైటిల్‌ ఇదే!

మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో