AP News: సాధారణ తనిఖీలు.. వాహనం వదిలి పారిపోయిన వ్యక్తులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా!

AP News: సాధారణ తనిఖీలు.. వాహనం వదిలి పారిపోయిన వ్యక్తులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా!

Ravi Kiran

|

Updated on: Mar 18, 2024 | 1:51 PM

కోనసీమ జిల్లాలో అక్రమ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు రావులపాలెం పోలీసులు. వాహనాలు తనిఖీల్లో భాగంగా రావులపాడు జాతీయ రహదారిపై ట్రైనీ డీఎస్పీ విష్ణు స్వరూప్ అటుగా వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా..

కోనసీమ జిల్లాలో అక్రమ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు రావులపాలెం పోలీసులు. వాహనాలు తనిఖీల్లో భాగంగా రావులపాడు జాతీయ రహదారిపై ట్రైనీ డీఎస్పీ విష్ణు స్వరూప్ అటుగా వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఇద్దరు యువకులు వారి వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరుగులు తీయడాన్ని గమనించారు. అనుమానమొచ్చి వారిని వెంబడించారు పోలీస్ సిబ్బంది. సినీ ఫక్కీలో పక్కనే ఉన్న వరి చేనుల్లోకి పరిగెత్తిన ఆ ఇద్దరు నిందితులను చివరికి చాకచక్యంగా పట్టుకున్నారు ఖాకీలు. సుమారు రూ. 10 లక్షల విలువైన 2 వందల కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 11 బస్తాల్లో నింపిన గంజాయిని కారులో రోడ్డు మార్గాన మారేడుమిల్లి నుంచి తిరుపతికి తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు భాగంగా కాగా.. అందులో ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. మరొక నిందితుడు పరారయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు రావులపాలెం పోలీసులు.

Published on: Mar 18, 2024 01:51 PM