సంక్రాంతి పండగ అంటే రంగు రంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గాలి పటాలతో పాటు గంగిరెద్దులు కూడా అందరికీ గుర్తుకు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి రెండు రోజుల ముందు నుంచే గంగిరెద్దుల కోలాహలం మొదలయ్యింది.