ఆలయ కుంటను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకుంటే సహించేది లేదని తాడిపత్రికి చెందిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. యాడికి వాసులు అక్కడ ఇళ్లు కట్టుకోవద్దని సూచించారు. పట్టణ అభివృద్ధి కోసం అక్రమ నిర్మాణాలను తప్పనిసరిగా జేసీబీలతో కూల్చేస్తామన్నారు.