అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ !!

Phani CH

Phani CH |

Updated on: Apr 24, 2022 | 9:07 PM

అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌. యూఎస్‌లో చదువుకునేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతుండటంతో వీసా స్లాట్లు పెంచేందుకు ఆ దేశం కసరత్తు చేస్తోంది.

అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే విద్యార్ధులకు గుడ్‌ న్యూస్‌. యూఎస్‌లో చదువుకునేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతుండటంతో వీసా స్లాట్లు పెంచేందుకు ఆ దేశం కసరత్తు చేస్తోంది. అక్కడి పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఐ-20 ధ్రువపత్రాల జారీని ముమ్మరం చేశాయి. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, కోల్‌కతలోని కాన్సులేట్‌ కార్యాలయాల్లో వీసా స్లాట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల వీసాలకు డిమాండు అధికంగా ఉండటంతో కొన్ని ఆంక్షలను కూడా విధించే అవకాశం ఉంది. ఒక సీజనులో ఒకదఫా మాత్రమే విద్యార్థి వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యేలా అవకాశం కల్పించనున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. . సాధారణంగా ఒకసారి వీసా తిరస్కరణకు గురైన తరవాత కొద్ది రోజుల వ్యవధిలో అదే కాన్సులేట్‌ లేదా ఇతర కార్యాలయాల్లో ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవటం ఇప్పటి వరకు జరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

న్యూస్‌ రీడర్‌కు కిమ్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఏంటో తెలుసా?

రైలు పట్టాల మధ్య క్యాజువల్‌గా పడుకున్న మహిళ !! రైలు వెళ్లిన తర్వాత ఏం చేసిందంటే ??

5 స్టార్ రేటింగ్‌తో చౌకైన ఫ్రిజ్‌లు.. కరెంట్‌ బిల్లు కూడా ఆదా..!

వామ్మో! బాహుబలి మొసలి !! 10 మంది అష్టకష్టాలూ పడి !!

100 మంది వృద్ధులు విమానం నుంచి దూకేశారు !! ఎందుకంటే ??

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu