ఇస్రోలో విషాదం.. సైంటిస్ట్‌ హఠాన్మరణం !! ఎలాగంటే ??

|

Sep 05, 2023 | 8:16 PM

ఇస్రోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాకెట్ ప్రయోగాల సమయంలో వినిపించే గొంతు మూగబోయింది. ఇస్రో సైంటిస్ట్ వాలార్మతి హఠాత్తుగా కన్నుమూశారు. సెప్టెంబరు 2న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె గుండెపోటుతో చనిపోయారు. వాలార్మతి చివరిసారిగా జులై 14న ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం సమయంలో కౌంట్ డౌన్ చెప్పారు. ఇస్రో చేపట్టే ఎన్నో ప్రయోగాల సమయంలో లైవ్ స్ట్రీమింగ్కు ఆమె వాయిస్ ఇచ్చారు.

ఇస్రోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాకెట్ ప్రయోగాల సమయంలో వినిపించే గొంతు మూగబోయింది. ఇస్రో సైంటిస్ట్ వాలార్మతి హఠాత్తుగా కన్నుమూశారు. సెప్టెంబరు 2న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె గుండెపోటుతో చనిపోయారు. వాలార్మతి చివరిసారిగా జులై 14న ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం సమయంలో కౌంట్ డౌన్ చెప్పారు. ఇస్రో చేపట్టే ఎన్నో ప్రయోగాల సమయంలో లైవ్ స్ట్రీమింగ్కు ఆమె వాయిస్ ఇచ్చారు. ఇస్రో ప్రయోగాల సమయంలో వినిపించే వాలార్మతి గొంతు దేశ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయింది. ఆమె మృతికి ఇస్రో సైంటిస్టులు సంతాపం తెలిపారు. 1959లో తమిళనాడులోని అరియలూర్‌లో జన్మించిన వలార్మతి 1984లో ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని మొదటిసారిగా 2015లో వాలార్మతి అందుకున్నారు. చివరిసారిగా చంద్రయాన్‌–3 మిషన్‌ రాకెట్‌కు వలార్మతినే కౌంట్‌డౌన్‌ చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరికి వెలుగునిచ్చేందుకు.. ప్రాణాలే ఫణంగా పెట్టిన లైన్‌మెన్

ఐదో ప్రియుడితో ముగ్గురు పిల్లల తల్లి పరార్‌.. పోస్టర్‌తో పిల్లల వెదుకులాట !!

రెప్పపాటులో తప్పించుకుంది.. లేదంటే క్షణాల్లో నూకలు చెల్లేవి

అయ్యో పాపం వృద్ధుడు.. ఆవు చేసిన పనికి

Rashmika Mandanna: తన అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన రష్మిక..