Imran Khan: మహిళల వస్త్రధారణపై ఇమ్రాన్‌ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు… ( వీడియో )

అధికారంలో ఉన్నవారు, ముఖ్యంగా పెద పదవిలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి..

అధికారంలో ఉన్నవారు, ముఖ్యంగా పెద పదవిలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.. ఇప్పటికే మహిళల వస్త్రధారణపై మగానుభావులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశారు.. ఇప్పుడు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఆ జాబితాలో చేరారు..మహిళలు ధరించే వస్త్రాల కారణంగానే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయనే ఓ వివాదాస్పదమైన మాట అనేశారు.. ఇలాంటి మాటను ఇక్కడ కూడా చాలా మంది అన్నారు.. ఇక్కడే కాదు.. ప్రపంచంలో ఉన్న మగవాళ్లందరూ దాదాపుగా ఇలాగే ఆలోచిస్తారేమో! మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా చేస్తున్నారని, అందుకే అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పుకొచ్చారు. మహిళలు కురచ దుస్తులు ధరిస్తే మగవాళ్ల మనసు చలిస్తుందట! తమ శరీరం కనిపించేలా దుస్తులు ధరిస్తే ఎవరు మాత్రం చలించకుండా ఉండరంటూ ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఇమ్రాన్‌ కామెంట్ చేసి పారేశారు. 

మరిన్ని ఇక్కడ చూడండి: Sarah Khan: తల్లి కాబోతున్న పాకిస్తాన్ అందాల తార నారాఖాన్.. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ప్రకటన.. ( వీడియో )

Hebah Patel : నా తప్పు ఏంటో తెలుసుకున్న అంటున్న హెబ్బా పటేల్.. ( వీడియో )

Click on your DTH Provider to Add TV9 Telugu