Hyderabad: ఘోర ప్రమాదంలో BBA విద్యార్థి స్పాట్ డెడ్.. మృతదేహాన్ని బయటకు తీసేందుకు 2 గంటలు

|

Aug 02, 2024 | 11:48 AM

కారు ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టడంతో.. 19 ఏళ్ల బీబీఏ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడు ICFAI యూనివర్సిటీ లో BBA చదువుతున్న విద్యార్థి చరణ్(19)గా గుర్తించారు.

హైదరాబాద్‌ రాయదుర్గంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. BNR హిల్స్ నుండి వేగంగా వచ్చిన కారు మార్కం చెరువు దగ్గర ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్‌ అనే యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుడు ICFAI యూనివర్సిటీ లో BBA చదువుతున్న విద్యార్థి చరణ్‌గా గుర్తించారు. మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా డ్యామేజ్‌ అయ్యింది. స్టీరింగ్‌, టైర్లు ఊడి పడ్డాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. పోలీసులు రెండుగంటలపాటు శ్రమించి కారు నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..