చర్మం పొడిబారుతోందా ?? ఇంట్లోనే మాయిశ్చరైజర్‌ ఓసారి ట్రై చేయండి

చర్మం పొడిబారుతోందా ?? ఇంట్లోనే మాయిశ్చరైజర్‌ ఓసారి ట్రై చేయండి

Phani CH

|

Updated on: Dec 07, 2024 | 12:07 PM

చలికాలం వచ్చిందంటే.. చర్మం పొడిబారటం, పెదాలు పగలటం, పాదాల పగుళ్లు.. ఇలా సమస్యలు వేధిస్తుంటాయి. దీనికి పరిష్కారంగా వివిధ రకాల మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తుంటారు చాలా మంది. అయితే బయట దొరికే వాటిలోని రసాయనాలు శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. దానికి బదులు.. ఇంట్లో లభించే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలను మాయిశ్చరైజర్లుగా వాడుకోవచ్చంటున్నారు నిపుణులు.

అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. శరీరం రోజంతా తేమగా, తాజాగా ఉండాలంటే విటమిన్‌ ‘ఇ’ నూనెను వాడాలి. ఇది చర్మంపై సులువుగా పరచుకోవడంతో పాటు చర్మం లోపలి పొరల్లోకి బాగా ఇంకుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీంతో పాటు కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనె, ఆర్గన్‌ ఆయిల్‌.. వంటివి మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. పొడిబారిన చర్మానికి, పెదాలకు తేమనందించడంలో షియా బటర్‌ చక్కగా పనిచేస్తుంది. ఇందులోని ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని పునరుత్తేజితం చేసి మెరిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.కోటి జీతాన్ని వదులుకుని.. ఐఏఎస్‌లో చేరి !!

అసలే చలికాలం.. ఆపై జ్వరాలు.. మరి జాగ్రత్తలేంటి ??

PV Sindhu: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న పీవీ సింధు

సముద్రపు ఒడ్డున యోగా చేస్తున్న నటి… అంతలోనే

TOP 9 ET News: బాలీవుడ్‌లో బన్నీ హిస్టరీ.. కలెక్షన్స్‌లో షారుఖ్‌ను దాటి నెంబర్ 1