రూ.కోటి జీతాన్ని వదులుకుని.. ఐఏఎస్‌లో చేరి !!
విజేతల కథనాలు ఎవరికైనా సరే శక్తివంతమైన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అడ్డంకులను అధిగమించడానికి, లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రేరణ కల్పిస్తాయి. కష్టపడి పనిచేయడమే విజయం వెనుకనున్న రహస్యం అని స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాయి. యూపీఎస్‌సీలో ఉత్తీర్ణత సాధించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఒక యువకుడు కోటి రూపాయలు జీతమొచ్చే ఉద్యోగాన్ని కాదనుకున్నాడు.
పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. కనిష్క్ కటారియాది ఇలాంటి ప్రయాణమే. తనది రాజస్థాన్‌లోని జైపూర్. ఐఐటీ బొంబాయి నుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యాడు. అనంతరం దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్ కంపెనీలో కోటి రూపాయల జీతంతో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది. వెంటనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేరాడు. కొన్నేళ్ల తర్వాత కనిష్క్ భారత్ కు తిరిగి వచ్చాడు. బెంగళూరులోని అమెరికన్ స్టార్టప్‌లో ఉద్యోగం చేశాడు. ఆ ఉద్యోగంలో కూడా అధిక జీతం వస్తున్నప్పటికీ, ఐఎఎస్ అవ్వాలన్న తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు ఉద్యోగాన్ని వదిలి ఢిల్లీకి చేరుకుని యూపీఎస్‌సీ కోచింగ్ తీసుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. గణితాన్ని ఆప్షనల్‌గా ఎంచుకుని పరీక్షలో విజయం సాధించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలే చలికాలం.. ఆపై జ్వరాలు.. మరి జాగ్రత్తలేంటి ??
PV Sindhu: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న పీవీ సింధు
సముద్రపు ఒడ్డున యోగా చేస్తున్న నటి… అంతలోనే
TOP 9 ET News: బాలీవుడ్‌లో బన్నీ హిస్టరీ.. కలెక్షన్స్‌లో షారుఖ్‌ను దాటి నెంబర్ 1
రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చిన పుష్పరాజ్.. AAల్ టైం రికార్డ్ !!