Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌లో పప్పాయ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వీడియో

సమ్మర్‌లో పప్పాయ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వీడియో

Samatha J

|

Updated on: May 12, 2025 | 7:27 AM

ఈ సమ్మర్ లో బాడీని కూల్ గా ఉంచుకోవాలంటే ఎలాంటి పండ్లు తినాలి? కోకోనట్, వాటర్ మెలన్, పప్పాయ ఇలాంటివి కదా మనం తింటాం. మరి పప్పాయ తినడం వల్ల వేసవిలో మంచిదా కాదా? ఇలాంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. పప్పాయలో ఏ, సి, ఈ అనే విటమిన్స్ ఉంటాయి. దీని వల్ల మీ చర్మం ఎప్పుడు మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. అలాగే పప్పాయలోని పెప్‌పైన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల మీ జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల అజీర్తి, గ్యాస్, ఉబ్బసం వంటి సమస్యలు కూడా మీకు రావు. వేసవిలో శరీరానికి చల్లదనం, శక్తి అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నీరు అధికంగా ఉండే పండ్లు ఎక్కువగా తినమని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. ఎండలకు ఎక్కువగా నీరసం వస్తుంది. వేసవిలో ఎండ, వేడిగాలులతో ఇబ్బంది పడతాం.

 అలాంటప్పుడు శరీరానికి శక్తి, చల్లదనం కావాలి. ఇలాంటప్పుడు పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. వేసవిలో తినడానికి పండ్లలో పప్పాయ ఒకటే. రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ వేసవిలో పప్పాయ అందరికీ మంచిదేనా? చౌకైన పండ్లలో ఇది కూడా ఒకటే. ఏ సీజన్ లో అయినా అందుబాటులో ఉంటుంది. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. స్కిన్ కి, హెయిర్ కి, ఆరోగ్యానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పప్పాయలో 88% నీరు ఉంటుంది. సో దీన్ని మీరు తీసుకోవడం వల్ల మీ బాడీ ఎప్పుడు కూల్ గా ఉంటుంది. అలాగే మీ బాడీలో తేమను ఎక్కువగా ఉంచుతుంది. పప్పాయలో ఫైబర్, విటమిన్ సి, కెరోటిన్, ఆర్జినైన్, కాబైన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా పప్పాయను వేసవిలో తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. హెల్త్ తో పాటు అందం కూడా పెరుగుతుంది. పప్పాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది ఈజీగా తగ్గుతుంది. దీనివల్ల మీకు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీ చర్మంపై దద్దుర్లు, వాపు ఇలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకొని పప్పాయ తినడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం :

కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో

పైనాపిల్ జ్యూస్ తాగడం వలన బోలెడు లాభాలు వీడియో

ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే మీ పని అవుట్!వీడియో

మీలో లవ్ హార్మోన్ పెరగాలా.. ఇలా చేయండి వీడియో

Published on: May 12, 2025 07:26 AM