AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

Samatha J
|

Updated on: Sep 25, 2025 | 8:14 AM

Share

ఈ ఏడాది బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. రూపాయి విలువ పతనం, అమెరికా హెచ్ 1బి వీసా రుసుము పెరుగుదల వంటి కారణాల వల్ల ఢిల్లీలో బంగారం ధర ₹1,18,900కు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర ₹39,950 పెరిగింది. వెండి ధర కూడా ₹1,39,600కు చేరి రికార్డు నమోదు చేసింది.

బంగారం ధరలు ఈ ఏడాది విపరీతంగా పెరిగాయి. రూపాయి విలువ పడిపోవడం, అమెరికా హెచ్ 1బి వీసా రుసుము పెరగడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర ₹1,18,900కు చేరింది. ఇది గత మార్కెట్ సెషన్ లోని ₹1,16,200 కంటే ₹2700 ఎక్కువ. ఈ సంవత్సరం మొత్తం 10 గ్రాముల బంగారం ధర ₹39,950 పెరిగింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి దాని ధర ₹78,950 ఉండగా, ప్రస్తుతం అది ఊహించని విధంగా పెరుగుతూనే ఉంది. వెండి ధర కూడా కిలోకు ₹3220 పెరిగి ₹1,39,600కు చేరింది. ఈ ఏడాది వెండి ధర ₹49,900 పెరిగింది.

మరిన్నివీడియోల కోసం :

Super Prime Time : అడవిలో అన్నలకు ఇవి ఆఖరి రోజులేనా వీడియో

సినిమా టికెట్లపై రూ.200 పరిమితి మీద హైకోర్టు స్టే వీడియో

Earthquake In Ongole : ఒంగోలులో భూ ప్రకంపనలు వీడియో