Regi pallu: ఈ పళ్లను లైట్ తీసుకుంటే నష్టపోతారు.. కోట్లు ఖర్చుపెట్టినా దక్కని పోషకాలు..
పొలాల్లో.. రోడ్ల పక్కన.. ఎక్కడపడితే అక్కడ కనిపించే రేగు పళ్లు మన చిన్న తనంలో తిన్న జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. అయితే వీటిని ఏవో పిచ్చిపళ్లు అనుకుని లైట్ తీసుకుంటే చాలానే నష్టపోతారు. ఎందుకంటే వీటిల్లో పోషకాలు కోట్లు ఖర్చుపెట్టినా దక్కవు మరి. .రేగుపళ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
రేగిపళ్లు ఆస్టియో ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులను నివారిస్తుంది. ఈ పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండును పేస్ట్‌గా చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల గాయం మానడంతో పాటు చర్మం మృదువుగా మారుతుంది. అలాగే ఈ పండులో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇన్ఫెక్షన్లను దూరం పెడతాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది.
రేగిపళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి మరింత మెరుపును అందించడంలో సహాయపడుతుంది. మొటిమల నుండి కూడా రక్షిస్తుంది. ఈ పండులో ఉండే కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతాయి. అలాగే ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్స్, పాలీశాకరైడ్స్, ఫ్లేవనాయిడ్స్, సపోనిన్‌లు ఉంటాయి. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి. అంతే కాకుండా ఇందులో బ్లడ్ షుగర్ తగ్గించే గుణాలు ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అయితే ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇప్పటికే కొన్ని వ్యాధులతో బాధపడతున్న వారు వైద్యుల సలహా తీసుకుని ఆహారంలో భాగం చేసుకోవాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

