Viral: ఎవరిదో అకౌంట్‌ నుంచి లక్ష రూపాయలొస్తే.. ఈ మెకానిక్ ఏం చేశాడో తెలుసా.?

Viral: ఎవరిదో అకౌంట్‌ నుంచి లక్ష రూపాయలొస్తే.. ఈ మెకానిక్ ఏం చేశాడో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Dec 10, 2024 | 3:27 PM

ఈ రోజుల్లో అప్పుగా ఇచ్చిన డబ్బులనే తిరిగి ఇవ్వడం లేదు. అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటిది రమణ అనే ఓ సాధారణ మెకానిక్.. తన ఖాతాలో లక్ష రూపాయలు పడ్డట్టు గుర్తించాడు. రమణకి ఎస్‌బిఐలో అకౌంట్ ఉంది. అప్పుడప్పుడు బ్యాంక్‌కు వెళ్లి తన డబ్బులను తెచ్చుకుంటుండేవాడు.. అయితే రెండు రోజుల క్రితం ఎప్పటిలానే రమణ బ్యాంక్ కు వెళ్లాడు.

తన డబ్బులు తీసుకుంటున్న క్రమంలో తన ఖాతాలో అధిక మొత్తంలో డబ్బులుండటాన్ని గమనించాడు. ఎంత అంటే లక్ష రూపాయలు తన ఖాతాలో ఉన్నాయి. అవి తన డబ్బులు కాదన్న విషయం రమణకి అర్దమైంది. అయితే తన చిన్న జీవితానికి లక్ష రూపాయలు పెద్ద మొత్తమే.. తాను నడుపుకుంటున్న సైకిల్ షాపు ఆ లక్ష రూపాయలతో మరింత మెరుగ్గా తీర్చి దిద్దుకోవచ్చు. లేదంటే కుటుంబ అవసరాలకు వాటిని వాడుకోవచ్చు.. అయితే రమణ ఇవేమీ చేయకుండా ఏం చేశాడో తెలుసా.? గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉన్న రమణ వృత్తి సైకిల్ మెకానిక్… చిన్న షాపు పెట్టుకొని ఎప్పటి నుండో సైకిల్స్ రిపేరు చేస్తూ దానితో వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం తనవి కాని డబ్బులు తన ఖాతాలో లక్ష రూపాయలు జమ కాగా అవి ఎక్కడ నుండి వచ్చాయో చూడాలని బ్యాంక్‌ అధికారులను కోరాడు. వెంటనే బ్యాంక్ సిబ్బంది ఆ డబ్బులు ఎక్కడ నుండి ట్రాన్స్‌ఫర్ అయ్యాయో చూసారు.

ఒడిస్సాకు చెందిన పంకజ్ మాఝీ ఖాతా నుండి రమణ ఖాతాకు వచ్చినట్లు బ్యాంక్ సిబ్బంది చెప్పారు. వెంటనే అతని డిటెయిల్స్ తీసుకొని అతని ఖాతాకు తిరిగి పంపించమని రమణ బ్యాంక్ సిబ్బందితో చెప్పాడు. వెంటనే బ్యాంక్ సిబ్బంది పంకజ్ మాఝీ అడ్రస్ సేకరించి అతని ఫోన్ చేశారు. అతను వచ్చి రాని ఇంగ్లీష్‌లో మాట్లాడి తన పిల్లల ఫీజు కట్టే క్రమంలో ఒక ఖాతాకు బదులు మరొక ఖాతాకు ఆ మొత్తాన్ని పంపించినట్లు చెప్పాడు. వెంటనే రమణ ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడని బ్యాంక్ సిబ్బంది పంకజ్‌కు చెప్పారు. వెంటనే రమణ లక్ష రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం తిరిగి పంకజ్ ఖాతాకు జమ చేశాడు. డబ్బులు వెంటనే తన ఖాతాకు జమ కావడంతో పంకజ్ మాఝీ సంతోషం వ్యక్తం చేశాడు. రమణ నిజాయితీని మెచ్చుకున్నాడు. బ్యాంక్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. సకాలంలో తిరిగి డబ్బులు ఇచ్చేయడంతో తమ పిల్లల చదువు ఆగకుండా చేశారని చెప్పుకున్నాడు. అంతేకాదు తన లక్ష రూపాయలు తనకిచ్చిన సైకిల్ మెకానిక్ రమణకు కృతజ్ఞతతో 3 వేల రూపాయలు బహుమతిగా అతని బ్యాంకు ఖాతాకు పంపించాడు. దీంతో రమణ కూడా సంతోషంగా ఆ మొత్తాన్ని తీసుకున్నాడు. రమణ నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.