Vishwambhara Teaser Live: దసరా వేళ చిరంజీవి ‘విశ్వంభర’ ప్రభంజనం.. టీజర్ అదిరిపోయిందిగా..

|

Oct 12, 2024 | 11:36 AM

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న విశ్వంభర సినిమా ప్రభంజనం మొదలైంది.. దసరా కానుకగా.. చిరంజీవి విశ్వంభర టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సరిగ్గా శనివారం ఉదయం 10.49 నిమిషాలకు విశ్వంభర టీజర్ ను విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న విశ్వంభర సినిమా ప్రభంజనం మొదలైంది.. దసరా కానుకగా.. చిరంజీవి విశ్వంభర టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సరిగ్గా శనివారం ఉదయం 10.49 నిమిషాలకు విశ్వంభర టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ రిలీజ్ వేడుక బాలనగర్ లోని విమల్ థియేటర్ లో అట్టహాసంగా జరిగింది. విశ్వంభర మూవీ వశిష్ఠ దర్శకత్వంలో, యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతోంది.. చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మాతలు.. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి.. నేడు విడుదలవుతున్న టీజర్‌తోపాటు, విడుదల తేదీపై కూడా చిత్రబృందం స్పష్టతనిచ్చే అవకాశాలున్నాయి.

విశ్వంభర టీజర్ చూడండి..

విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న విశ్వంభర.. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా.. శ్వేత అశ్వంపై మెగాస్టార్ కనిపించనున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరి, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా నటిస్తున్నారు.