Vijay Deverakonda: రష్మిక‏ నా డార్లింగ్.. ఆ టైమ్ వచ్చినప్పుడు గట్టిగా చెప్తా

Vijay Deverakonda: రష్మిక‏ నా డార్లింగ్.. ఆ టైమ్ వచ్చినప్పుడు గట్టిగా చెప్తా

Phani CH

|

Updated on: Jul 30, 2022 | 9:29 AM

మోస్ట్ అవైయిటెట్ ఫిల్మ్ లైగర్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతుంది.



మోస్ట్ అవైయిటెట్ ఫిల్మ్ లైగర్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగాంగా ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు విజయ్ (Vijay Deverakonda), హీరోయిన్ అనన్య. ఈ క్రమంలో హీరోయిన్ రష్మిక మందన్నాతో తనకున్న రిలేషన్ షిప్ గురించి చెప్పుకొచ్చారు విజయ్‌. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై అటు రష్మిక, ఇటు విజయ్ ఇద్దరూ స్పందించలేదు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో.. రష్మిక తన డార్లింగ్ అని తనంటే చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చారు విజయ్. “రష్మిక నేను కలిసి 2 సినిమాలు చేశాము. మేమిద్దరం స్నేహితులం. తను నిజంగా నా డార్లింగ్. తనంటే చాలా ఇష్టం. జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి మేమేప్పుడు మాట్లాడుకుంటాం. మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తనకు తన తల్లిదండ్రులు, డైరెక్టర్ పూరితో మంచి అనుబంధం ఉందని చెప్పారు. తాను పెళ్లి చేసుకుని పిల్లలను కనే రోజు వస్తే ఆ విషయం అందరికీ గట్టిగా చెబుతానని… తనను ప్రేమించే ప్రేక్షకుల మనసు నొప్పించాలనుకోవడం లేదని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RRR: మరో దిమ్మతిరిగే రికార్డు క్రియేట్‌ చేసిన RRR

Ramarao on Duty: ‘రామారావ్‌ ఆన్ డ్యూటీ’ నుంచి వీడియో లీక్‌

Vijay Deverakonda: ‘ప్లీజ్! నాకు లైన్‌ వేయడం ఆపు’ అనన్యకు VD క్యూట్ రెక్వెస్ట్

Bimbisara: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బింబిసారుడు..

Jr NTR: తమిళ్‌ NTR ఫ్యాన్స్ వీరంగం.. వీపుకు ఇనుప చువ్వలతో మొక్కులు

Published on: Jul 30, 2022 09:29 AM