Vijay Deverakonda: అనన్య ఒడిలో పడుకొని కునుకు తీసిన విజయ్ !! నెట్టింట వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇక కొద్ది రోజుల్లో ప్యాన్ ఇండియ ఆస్టార్‌గా మనముందుకు రాబోతున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్-విజయ్‌దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న ‘లైగర్’ చిత్రం ఆగస్టు 25న తెలుగుతోపాటు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇక కొద్ది రోజుల్లో ప్యాన్ ఇండియ ఆస్టార్‌గా మనముందుకు రాబోతున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్-విజయ్‌దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న ‘లైగర్’ చిత్రం ఆగస్టు 25న తెలుగుతోపాటు తమిళం, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చిత్రం బృందం ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా వివిధ ఈవెంట్లలో పాల్గొంటూ ‘లైగర్’ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు హీరో విజయ్, హీరోయిన్ అనన్య. ఈ క్రమంలో ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ఈ ఇద్దరూ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయణించారు. ముంబైలో ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకునేందుకు వీరు ట్రైన్ ఎంచుకున్నారు. ట్రైన్ వచ్చే వరకూ రైల్వే స్టేషన్‌లో చాలా సేపు వేచి ఉన్నారు. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలో బాగా అలిసిపోయిన విజయ్ కొద్దిసేపు అనన్య ఒడిలో పడుకొని కునుకు తీశారు. ఈ ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘లైగర్ ప్రమోషన్స్ ‘ట్రాక్’లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: రష్మిక నా డార్లింగ్.. ఆ టైమ్ వచ్చినప్పుడు గట్టిగా చెప్తా