Pranitha Subhash: పతియే ప్రత్యక్ష దైవం అంటూ పాద పూజ చేసిన ప్రణీత
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులు మనసు దోచుకున్న అందాల నటి ప్రణీత. ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ కన్నడ నటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది..
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులు మనసు దోచుకున్న అందాల నటి ప్రణీత. ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ కన్నడ నటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ అందాల తార గతేడాది బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రణీత తన భర్తకు పాదపూజ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అసలు విషయమేంటంటే.. కర్ణాటకలో మహిళలు భీమన అమావాస్య పర్వదినాన్ని అత్యంత శుభకరమైన రోజుగా భావిస్తారు. భర్త యందు భార్య తన భక్తి ప్రపత్తులు, ప్రేమాభిమానాలు చాటుకునే పర్వదినంగా భీమన అమావాస్యకు పేరుంది. ఆషాఢ మాసంలో వచ్చే ఈ భీమన అమావాస్యను జూలై 28న భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ క్రమంలో నటి ప్రణీత కూడా ఈ పండుగను ఆచరించారు. ఆమె తన భర్త నితిన్ రాజుకు పాదపూజ చేశారు. భర్త నుంచి ఆశీస్సులు అందుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: అనన్య ఒడిలో పడుకొని కునుకు తీసిన విజయ్ !! నెట్టింట వైరల్
Vijay Deverakonda: రష్మిక నా డార్లింగ్.. ఆ టైమ్ వచ్చినప్పుడు గట్టిగా చెప్తా