Saindhav: హాలీవుడ్‌ రేంజ్‌లో సైంధవ్ ట్రైలర్... వెంకీ మామ చింపేశాడుగా

Saindhav: హాలీవుడ్‌ రేంజ్‌లో సైంధవ్ ట్రైలర్… వెంకీ మామ చింపేశాడుగా

Phani CH

|

Updated on: Jan 04, 2024 | 12:16 PM

సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న నయా మూవీ సైందవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైందవ్ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు శైలేష్. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ నటిస్తున్న 75 వ సినిమా ఇది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. శైలేష్ గతంలో తెరకెక్కించిన హిట్ 1,2 మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న నయా మూవీ సైందవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైందవ్ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు శైలేష్. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ నటిస్తున్న 75 వ సినిమా ఇది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. శైలేష్ గతంలో తెరకెక్కించిన హిట్ 1,2 మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ కెరీర్ లో బెంచ్ మార్క్ మూవీ కావడంతో ఈ సినిమాను చాలా పకడ్బందీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా సైందవ్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు . ఈ ట్రైలర్ ను యాక్షన్ సీన్స్ తో కట్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని అనిపిస్తుంది. వెంకటేష్ యాక్షన్ అవతార్ లో అదరగొట్టేశాడు. విజువల్స్ కూడా చాల రిచ్ గా కనిపిస్తున్నాయి. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను కూడా మిక్స్ చేసి ట్రైలర్ ను కట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hanu Man: అలా చెబితే సినిమా ఎవరైనా చూస్తారా ?? ఏంటి బ్రో

Janhvi Kapoor: నోరు జారింది.. ప్రేమాయణం బయటపడింది.. పాపం జాన్వీ

40 ఏళ్ల వయసు.. బ్యూటిఫుల్ అమ్మాయితో పెళ్లి.. విలన్ కథ మామూలుగా లేదుగా

Guntur Kaaram: ట్రైలర్ వచ్చేస్తోందోచ్‌.. కుర్చీ మడతెట్టాల్సిందే !!

Salaar: జైలర్‌ రికార్డ్‌ బద్దల్‌.. హిస్టరీ క్రియేట్‌ చేసిన సలార్..