TOP 9 ET: బ్రేకింగ్: కోర్టులో ఆదిపురుష్‌ ఇష్యూ.. | దిమ్మతిరిగే అప్డేట్.. మరో రెండు రోజుల్లో భోళా శంకర్ టీజర్‌.

TOP 9 ET: బ్రేకింగ్: కోర్టులో ఆదిపురుష్‌ ఇష్యూ.. | దిమ్మతిరిగే అప్డేట్.. మరో రెండు రోజుల్లో భోళా శంకర్ టీజర్‌.

Anil kumar poka

|

Updated on: Jun 23, 2023 | 10:04 AM

కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ బర్త్ డే సందర్భంగా అప్‌ కమింగ్ మూవీ లియో ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. విక్రమ్ సినిమాతో నేషనల్‌ లెవల్‌లో సెన్సేషన్‌ క్రియట్‌ చేసిన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

01. Salaar
మరో వంద రోజుల్లో సలార్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. జూలై 7 ఈ సినిమా ఫస్ట్ టీజర్‌ రిలీజ్ కానుంది. చాలా కాలం తరువాత ప్రభాస్ మాస్ యాక్షన్‌ రోల్‌లో నటిస్తున్న సలార్‌ సినిమాకు కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్ నీల్‌ దర్శకుడు. ప్రభాస్‌కు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28ప ప్రేక్షకుల ముందుకు రానుంది.

02.Toli Prema
పవన్ కళ్యాణ్ సినిమాలు వరసగా రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతేడాది ఈయన నటించిన జల్సా, ఖుషీ సినిమాలను విడుదల చేసిన మేకర్స్.. ఈ ఏడాది బద్రిని కూడా తీసుకొచ్చారు. తాజాగా క్లాసిక్ హిట్ తొలిప్రేమ సినిమాను జూన్ 30న రీ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రిలీజై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తొలిప్రేమను మరోసారి థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు.

03.Nani 30
ఈ మధ్యే దసరా సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్న నాని.. ప్రస్తుతం మరోసారి కొత్త దర్శకుడినే నమ్ముతున్నారు. శ్రీకాంత్ ఓదెల తర్వాత తాజాగా యువ దర్శకుడు షౌర్యుతో పని చేస్తున్నారు. ఈయనతో కలిసి చేస్తున్న షూటింగ్ వేగంగా పూర్తవుతుంది. తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో సినిమా వస్తుంది. ఈ చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తయింది. చివరి షెడ్యూల్ కూనూర్‌లో జరగనుంది. ఆగస్ట్ నాటికి షూటింగ్ పూర్తి చేసి.. డిసెంబర్‌ 21న సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

04.Vijay
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ బర్త్ డే సందర్భంగా అప్‌ కమింగ్ మూవీ లియో ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. విక్రమ్ సినిమాతో నేషనల్‌ లెవల్‌లో సెన్సేషన్‌ క్రియట్‌ చేసిన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ నటి త్రిష చాలా కాలం తరువాత విజయ్‌కి జోడిగా కనిపించబోతున్నారు. లలిత్‌ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్‌ సంగీమందిస్తున్నారు.

05. Naveen Polishetty
నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ 2019లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే నవీన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జాతి రత్నాలుతో క్రేజీ హీరో అయ్యారు నవీన్ పొలిశెట్టి. సాయి శ్రీనివాస్ ఆత్రేయ విడుదలై 4 ఏళ్లు పూర్తైన సందర్భంగా లండన్ వెళ్లి అక్కడ షెర్లాక్ హోమ్స్ దగ్గర్నుంచి ఓ వీడియో పోస్ట్ చేసారు నవీన్. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

06.Sanjay Dutt
బాలీవుడ్‌ సీనియర్ హీరో సంజయ్ దత్‌ వ్యాపార రంగంలోనూ బిజీ అవుతున్నారు. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్న సంజు బాబా, త్వరలో లిక్కర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏకంగా వెయ్యి కోట్ల పెట్టుబడితో లిక్కర్ రిటైల్‌ స్టార్టప్‌లో జాయిన్ అవుతున్నారు సంజు. ప్రజెంట్ బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్‌లో లియో, ప్రభాస్ – మారుతి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు సంజయ్ దత్‌.

07. Adipurush
డార్లింగ్ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది ఆదిపురుష్ మూవీ టీమ్‌. కొన్ని సెలెక్టెడ్ సిటీస్‌లో సినిమా 3డీ వర్షన్‌ టికెట్‌ ధరను 150 రూపాయలకు తగ్గిస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్‌. అయితే ఈ అవకాశం సౌత్ ఆడియన్స్‌కు మాత్రం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో ఈ ఆఫర్‌ అందుబాటులో లేదు. ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాకు ఓం రవుత్ దర్శకుడు.

08.Chiranjeevi
చిరు మోస్ట్ అవేటెడ్ మూవీ.. భోళాశంకర్ నుంచి.. తాజాగా దిమ్మతిరిగే అప్డేట్ వచ్చింది. మెహర్ రమేష్‌ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ నుంచి.. జూన్‌ 24నే టీజర్‌ రాబోతుంది. ఇక ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ తాజాగా తమ సోషల్ మీడయా హ్యాండిల్లో అనౌన్స్ చేశారు. మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా చేశారు.

09.Adipurush
ఆదిపురుష్‌ మేకర్స్కు ఢిల్లీ హై కోర్టులో స్వల్ప ఉరట లభించింది. ఈ మూవీ రామాయణాన్ని వక్రీకరిస్తూ తెరకెక్కించారని.. వివాదాస్పద అంశాలు కూడా ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయని.. అందుచేత ఈ మూవీపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే ఇదే పిల్‌ ను ఢిల్లీ హైకోర్టు కాస్త లైట్ తీసుకుంది. ఈ సినిమాపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదుంటూ.. కోర్టు తేల్చిచెప్పింది. జూన్‌ 30 న హియరింగ్ ఉంటుందని.. అప్పుడు విచారిస్తమని తెల్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 23, 2023 09:09 AM