TOP9 ET: ఆటను మార్చేటోడు.. రామ్ చరణ్.| దేవరను ఢీకొట్టే భైరవ ఇతడే..!
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా లియో. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ బిజినెస్ జరుగుతుంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి దాదాపు 400 కోట్ల వరకు జరుగుతుందని తెలుస్తుంది. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ బిజినెస్ జరుగుతుంది. సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.
01.Ram Charan Game Changer
గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్న చెర్రీకి.. ఫ్యాన్స్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే..! పంద్రాగస్ట్ సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ డైరెక్టర్ శంకర్.. ఆ సినిమా సెట్లో వర్క్ చేస్తున్న పిక్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు. ఫ్రమ్ ది సెట్స్ ఆఫ్ గేమ్ చేంజర్ అంటూ.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ.. ఆ పిక్ కింద కోట్ చేశారు. ఇక పిక్‌నే తీసుకున్న కొంత మంది చెర్రీ డైహార్డ్ ఫ్యాన్స్ .. తమ ఫోటో షాపీ స్కిల్స్‌తో.. డైరెక్టర్ శంకర్‌ను లేపేసి.. అదే ప్లేస్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోటోను పెట్టారు. ధృవ సినిమాలో ఓ స్టిల్‌ను .. శంకర్ షేర్ చేసిన ఫోటోతో పర్ఫెక్ట్ గా ఎడిట్ చేశారు. అఫీషియల్ లుక్‌లా.. మార్చేశారు. ఇప్పుడా పిక్‌తోనే.. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ మూవీని వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఆటను మార్చేటోడంటూ.. నెట్టింట ట్యాగ్స్ ఇస్తున్నారు.
02.NTR Devara
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవెటెడ్ మూవీగా తెరకెక్కుతున్న దేవర నుంచి .. చాలా రోజుల తర్వాత ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో విలన్గా చేస్తున్న బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ ఆయన బర్త్‌డే సందర్భంగా బయటికి వచ్చింది. దేవరకు పవర్ ఫుల్ విలన్‌గా.. చేస్తున్న సైఫ్ అలియాస్ భైరవ లుక్కే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతోంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్ ఊహించినట్టుగా క్రూరంగా కాకుండా.. ఈ విలన్ లుక్స్ ఇంటెన్సివ్‌గా.. వింటేజ్ గా ఉండడం ఇప్పుడు కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చేలా చేస్తోంది.
03.Girija
నాగార్జున గీతాంజలి. సినిమాలోని హీరోయిన్ గుర్తుందా..! అదే తన డెబ్యూ సినిమాగా గీతాంజలి సినిమాతో.. అందర్నీ ఆకట్టుకున్న హీరోయిన్ గిరిజా షెట్టి.. ఇన్నాళ్లకు.. మరో సినిమా చేస్తున్నారు. గీతాంజలి సినిమా తర్వాత.. ఓ రెండు మూడు సినిమాలు చేసి పక్కకు తప్పుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అంటే దాదాపు 18 ఏళ్ల తరువాత ఓ కన్నడ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
04.Kushi
ఖుషి సినిమా ప్రమోషన్‌లో భాగంగా భారీ మ్యూజికల్ కన్సర్ట్‌ను నిర్వహించింది చిత్రయూనిట్. సినిమాలో పాటలు పాడిన సింగర్స్ ఈ వేదిక మీద లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, సమంత కూడా స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన ఫ్యాన్స్‌ను ఖుషి చేశారు. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
05.Jailer
బ్లాక్ బస్టర్ జైలర్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఏడాది కోలీవుడ్‌లో హైయ్యస్ట్ గ్రాసర్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది జైలర్. ఇన్నాళ్లు పొన్నియిన్ సెల్వన్ 2 పేరిట ఉన్న రికార్డ్ ఇప్పుడు జైలర్ సొంతమైంది. నేషనల్ లెవల్‌లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది ఈ మూవీ. పఠాన్, ఆదిపురుష్ సినిమాలు జైలర్ కన్నా ముందున్నాయి.
06.Devara
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తారక్, తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపిస్తారని, ఒక క్యారెక్టర్‌లో 60 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
07. Leo
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా లియో. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ బిజినెస్ జరుగుతుంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి దాదాపు 400 కోట్ల వరకు జరుగుతుందని తెలుస్తుంది. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ బిజినెస్ జరుగుతుంది. సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.
08.Indian 2..
లోకనాయకుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. స్వాంతంత్య్ర దినోత్సవ సందర్భంగా సినిమాలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైంది. 2024 సమ్మర్‌లో విడుదల కానుంది ఇండియన్ 2.
09. Gadar 2
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన గదర్ 2 ఎవరి ఊహకు అందని విధంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అసలు ఈ చిత్రం ఈ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తుందని ఎవరూ అనుకోలేదు. రోజు రోజుకీ ట్రేడ్‌కు షాక్ ఇస్తూ దున్నేస్తుంది సినిమా. ఉత్కర్ష్ శర్మ నిర్మాతగా దర్శకుడు అనిల్ శర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కేవలం 5 రోజుల్లోనే 230 కోట్లకు పైగా వసూలు చేసింది గదర్ 2. కాగా హైదరాబాద్‌లో స్పెషల్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసారు మేకర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...