AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET: దయచేసి ఆ రూమర్స్‌ నమ్మకండి | కొండపై పాడు పని హీరోయిన్‌కు డైరెక్టర్‌ ముద్దు..!

TOP 9 ET: దయచేసి ఆ రూమర్స్‌ నమ్మకండి | కొండపై పాడు పని హీరోయిన్‌కు డైరెక్టర్‌ ముద్దు..!

Anil kumar poka
|

Updated on: Jun 07, 2023 | 9:20 PM

Share

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ భూల్‌ బులయ్యా 2ను అక్కినేని నాగచైతన్య తెలుగులో రీమేక్‌ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై చైతూ టీమ్ స్పందించింది. ప్రస్తుతం నాగచైతన్య ఏ రీమేక్‌లోనూ నటించటం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. రూమర్స్‌ను నమ్మవద్దంటూ అభిమానులను కోరింది చైతూ టీమ్‌. రీసెంట్‌గా తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు..

01.Adipurush
ఆదిపురుష్ ప్రీ రిలీజ్‌ వేడుక తిరుపతిలో ఘనంగా జరిగింది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఆదిపురుష్ టీమ్‌కు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో ఫైనల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించిన ఈ సినిమాకు అజయ్‌ – అతుల్‌ సంగీతమందించారు. ఓం రవుత్ దర్శకత్వం వహించారు. ఆదిపురుష్ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

02. Guntur Karam
మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల ఫారిన్ టూర్‌ నుంచి తిరిగి వచ్చిన మహేష్ ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారు. మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

03. Indian 2
ఇండియన్ 2 నుంచి ఓ షాకింగ్ లీక్ బయటికొచ్చి తెగ వైరల్ అవుతోంది. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డైరెక్టర్‌ కమ్ వెర్సటైల్ యాక్టర్ ఎస్ సూర్య మెయిన్ విలన్‌గా చేస్తున్నారట. ఇక ఇదే న్యూస్ కోలీవుడ్ నుంచి బయటికి వచ్చి నెట్టింట తెగ వైలర్ అవుతోంది. సినిమాపై మరింతగా అంచనాలను కూడా పెంచేస్తోంది.

04.Satyaprem ki Katha
నా సినిమా ట్రైలర్‌ నా భర్తకు నచ్చింది చాలు అంటూ పొంగి పోతున్నారు స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ. ఇక రీసెంట్గా రిలీజ్ తన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సత్యప్రేమ్‌ కథ ట్రైలర్‌ పై.. తన హబ్బీ సిద్దార్థ్‌ బాగుందంటూ చెప్పడంతో..ఈ బ్యూటీ ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ సినిమా ఎలాగైనా హిట్టవుతుందంటూ ఖుషీ అవుతున్నారు.

05. Rocky aur
రణవీర్ సింగ్‌, ఆలియా భట్‌ జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని. చాలా కాలం తరువాత కరణ్ జోహార్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మీద బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మూవీ టీమ్‌ త్వరలో ప్రమోషన్‌ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెలాఖరున ఓ భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌ను లాంచ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

06. Aryan Khan
షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. స్టార్‌ డమ్‌ పేరుతో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఆర్యన్‌. ఈ షోలో స్టార్ హీరో రణబీర్ కపూర్ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నారట. తాజాగా స్టార్‌డమ్‌ సెట్‌లో రణబీర్‌ సందడి చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణబీర్‌తో పాటు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్‌ కరణ్ జోహార్ కూడా ఈ సిరీస్‌లో కీ రోల్ చేస్తున్నారనే టాక్ వస్తోంది.

07. Leo
విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న లియో సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. కీలకమైన హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు. దాదాపు 500 మంది డ్యాన్సర్స్‌తో భారీగా రూపొందిస్తున్న ఈ పాటకు దినేష్ మాస్టర్ కొరియోగ్రాఫీ అందిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్‌కు రెడీ అవుతోంది లియో.

08. 2018
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ 2018 వివాదంలో చిక్కుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 2018 సంచలన విజయం సాధించింది. ఏకంగా 200 కోట్ల క్లబ్‌లో చేరి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాను ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేయటంపై కేరళ థియేటర్‌ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందుకు నిరసనగా ఈ రోజు, రేపు థియేటర్ల యాజమాన్యం సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించింది.

09. Naga Chaitanya
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ భూల్‌ బులయ్యా 2ను అక్కినేని నాగచైతన్య తెలుగులో రీమేక్‌ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై చైతూ టీమ్ స్పందించింది. ప్రస్తుతం నాగచైతన్య ఏ రీమేక్‌లోనూ నటించటం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. రూమర్స్‌ను నమ్మవద్దంటూ అభిమానులను కోరింది చైతూ టీమ్‌. రీసెంట్‌గా తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన బైలింగ్యువల్ మూవీ కస్టడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగచైతన్య.

10. Om Raut
తిరుమల కొండపై ఇదో కొత్త వివాదం. నిన్నటి ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత ఆదిపురుష్ టీమ్ ఇవాళ స్వామివారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత వెళ్లిపోతుండగా ఓం రౌత్‌ ఈ చర్యకు పాల్పడ్డారు. కారు ఎక్కబోతున్న నటి కృతి సనన్‌ను ఆలింగనం చేసుకుని.. ఆప్యాయంగా ఓ ముద్దుపెట్టారు. ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. సినిమా వాళ్లకు, సెలబ్రిటీలకు ఈ తరహా ఆప్యాయతలు సహజమే అయినా.. కొండంత పవిత్రత ఉన్న వెంకటేశుడి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అతి అప్యాయతలు మాత్రం ముమ్మాటికీ తప్పే అంటోంది బీజేపీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.