TOP 9 ET: అడుగుల భారీ కటౌట్..ఆకాశాన్ని అంటిన క్రేజ్ | గెట్ రెడీ.. సలార్ నుంచి దిమ్మతిరిగే అప్డేట్
లాఠీ, రాజరాజచోరతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సునయన. తాజాగా ఈమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ యాక్సిడెంట్‌లో సునయనకు కొన్ని గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈమె. త్వరలోనే బయటికి రానున్నట్లు చెప్పారు. - కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా నాయకుడు. ఈ సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే నవంబర్ 3న నాయకుడు 4K వర్షన్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు మేకర్స్.
01. Prabhas
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే వేడుకలు ఆకాశాన్ని అంటేలా జరగనున్నాయి. అక్టోబర్ 23 డార్లింగ్ బర్త్‌డే కావడంతో.. ఇప్పటికే హంగామా షురూ చేసిన ఫ్యాన్స్.. హైద్రాబాద్‌లో మరో రేర్ ఫీట్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కూకట్ పల్లి ఖైతలాగన్ గ్రౌండ్‌లో.. ఈ సారి ఏకంగా డార్లింగ్ 230 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు చకాచకా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
02. Salaar
సలార్ వీడియో గ్లింప్స్ చూసింది మొదలు.. ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రెబల్ ఫ్యాన్స్‌కో గుడ్ న్యూస్. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 22 అర్థరాత్రే సలార్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. సో అక్టోబర్ 22 అర్థరాత్రి సలార్ ఫిరోషియస్ ట్రైలర్ ను మీరు విట్‌నెస్ చేసేందుకు రెడీ ఉండండి మరి.
03.Nani
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మరో సినిమా వచ్చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరూ ‘అంటే సుందరానికి’ సినిమా చేశారు. ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు. అయినా కూడా వివేక్ కథ నచ్చి మరో ఛాన్స్ ఇచ్చారు నాని. ఈ సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
04. Mangalavaram
ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మంగళవారం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తుంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
05.NKR 21
డెవిల్ ది సీక్రెట్ బ్రిటిష్ ఏజెంట్ అనే సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ తాజాగా తన కెరీర్ 21వ సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి భారీగా నిర్మిస్తున్నాయి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దీనికి దర్శకుడు.
06. Sunayana
లాఠీ, రాజరాజచోరతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సునయన. తాజాగా ఈమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ యాక్సిడెంట్‌లో సునయనకు కొన్ని గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈమె. త్వరలోనే బయటికి రానున్నట్లు చెప్పారు.
07.Nayagan
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా నాయకుడు. ఈ సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే నవంబర్ 3న నాయకుడు 4K వర్షన్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు మేకర్స్. కాగా త్వరలోనే మణిరత్నం, కమల్ కాంబినేషన్‌లో సినిమా రానుంది.
08.Keeda Cola
తరుణ్ భాస్కర్ నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా కీడా కోలా. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి డిపిరి డిపిరి అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. చైతన్య రావు, బ్రహ్మానందం, జీవన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
09.Katrina Kaif
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా మనీష్ శర్మ తెరకెక్కిస్తున్న సినిమా టైగర్ 3. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానుంది. దివాళి సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..