TOP 9 ET: OG దిమ్మతిరిగే అప్డేట్.. | మళ్లీ బరిలోకి దిగిన పుష్పరాజ్‌.. వీడియో.

TOP 9 ET: OG దిమ్మతిరిగే అప్డేట్.. | మళ్లీ బరిలోకి దిగిన పుష్పరాజ్‌.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 08, 2023 | 9:38 AM

సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత.. ప్రస్తుతం లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు ఈ భామ. ఇందులో భాగంగానే తన ప్రాణ స్నేహితురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పిల్లలతో ఆడుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు సమంత. వీటికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.

01.Bhola
సినిమా ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిదని భోళా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు మెగాస్టార్‌. ఎంత మంది వచ్చినా స్థానం ఉంటుందని చెప్పారు. అక్షయ పాత్రలాగా అందరి ఆకలి తీరుస్తుందని అన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరూ వెనకడుగు వేయొద్దని సూచించారు. అంతేకాదు అమ్మ ప్రేమ, అభిమానుల ప్రేమా బోర్‌ కొట్టదని చెప్పి.. ఆడిటోరియంలో ఉన్న తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌ను అరిపించారు. మంచి కథ దొరికినప్పుడు రీమేక్‌ చేయడానికి వెనుకాడనంటూ.. రిమేక్‌ల విషయంలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఈ స్టార్.

02.Pawan Og
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ నుంచి.. ప్రీ టీజర్ అండ్ టీజర్‌ రిలీజ్ డేట్ ఇవే అంటూ ఇండస్ట్రీ నుంచి ఓ లీక్ బయటికి వచ్చింది. ఇక ఆ డేట్స్‌తో పాటే.. పవన్‌ ఫ్యాన్ ఓజీ పోస్టర్స్‌ కూడా.. ఈసినిమా ప్రీ టీజర్‌.. టీజర్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఎప్పుడెప్పుడూ చూస్తామా అనే ఆత్రం రోజు రోజుకూ అందర్లో ఎక్కువయ్యేలా చేస్తోంది. ఇక అకార్డింగ్ టూ ఇన్సైడ్ న్యూస్… సుజీత్ డైరెక్షన్లో.. వస్తున్న ఓజీ మూవీ నుంచి ఆగస్టు 15న ప్రీ టీజర్‌ కానీ.. ఓ వీడియో గ్లింప్స్‌ కానీ రిలీజ్ కానుందట. పవన్‌ బర్త్‌ డే సెప్టెంబర్ 2న దిమ్మతిరిగి పోయే రేంజ్లో ఓ టీజర్‌ బటికి రానుందట. ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీ ఇంట బలంగా వినిపిస్తోంది.

03. pushpa
ద మోస్ట్ అవేటెడ మూవీ పుష్ప2 నయా షెడ్యూల్ తాజాగా స్టార్ట్ అయింది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు కీలక పాత్రధారులు పాల్గొంటున్నారు. తొలి భాగం సూపర్‌ హిట్ కావటంతో సీక్వెల్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్‌.

04.Samantha
సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత.. ప్రస్తుతం లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు ఈ భామ. ఇందులో భాగంగానే తన ప్రాణ స్నేహితురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పిల్లలతో ఆడుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు సమంత. వీటికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.

05.Kushi
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఆగస్ట్ 9న విడుదల కానుంది ఖుషీ ట్రైలర్. 2.41 నిమిషాల ట్రైలర్ కట్ చేసారు మేకర్స్.

06.Kanguva
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘కంగువ’. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దాదాపు పది గెటప్పుల్లో కనిపిస్తారు సూర్య. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు నుంచి రాజమండ్రి, మారేడుమిల్లి పరిసరాల్లో షెడ్యూల్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

07.Devil
కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డెవిల్‌. నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు మేకర్స్‌. నవంబర్ 24న డెవిల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్షవర్దన్‌ రామేశ్వర్ సంగీతమందిస్తున్న ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

08.Gandiva
గాంఢీవధారి అర్జున సినిమాలో తన పోర్షన్‌కి డబ్బింగ్‌ షురూ చేశారు హీరో వరుణ్‌ తేజ్‌. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ అలియాస్‌ అర్జున్‌ వర్మ డబ్బింగ్‌ మొదలుపెట్టేశారు. త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తామని చెప్పారు మేకర్స్. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

09.Jailer
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్‌ సినిమా తెలుగు వర్షన్‌ సెన్సార్ పూర్తయ్యింది. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యు బై ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్‌. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్‌ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...