TOP9 ET: డే1 కల్కీకి దిమ్మతిరిగే కలెక్షన్స్.! | తన లుక్స్‌తో థియేటర్లలో భూకంపం పుట్టిస్తోన్న కమల్.
రెబల్ స్టార్ ప్రభాస్ అనుకున్నట్టే చేశాడు. కల్కి మూవీతో.. ఆ మూవీ కొస్తున్న సూపర్ రెస్పాన్స్ తో.. వరల్డ్ వైడ్ చిన్న పాటి విస్పోటనాన్ని క్రియేట్ చేశాడు. అప్పటికే రికార్డ్ లెవల్లో బిజినెస్ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్‌కు తోడు దిమ్మతిరిగే ఓపెనింగ్స్‌తో.. కలెక్షన్స్‌లో నయా రికార్డ్‌ను ఎస్టాబ్లిష్ చేసేలానే ఉన్నాడు. డే 1 కలెక్షన్స్‌లో.. దాదాపు 250 కోట్లకు పైగా వసూలు చేసేలానే ఉన్నాడు.
01.kalki: డే1 కల్కీకి దిమ్మతిరిగే కలెక్షన్స్..!
రెబల్ స్టార్ ప్రభాస్ అనుకున్నట్టే చేశాడు. కల్కి మూవీతో.. ఆ మూవీ కొస్తున్న సూపర్ రెస్పాన్స్ తో… వరల్డ్ వైడ్ చిన్న పాటి విస్పోటనాన్ని క్రియేట్ చేశాడు. అప్పటికే రికార్డ్ లెవల్లో బిజినెస్ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్‌కు తోడు దిమ్మతిరిగే ఓపెనింగ్స్‌తో.. కలెక్షన్స్‌లో నయా రికార్డ్‌ను ఎస్టాబ్లిష్ చేసేలానే ఉన్నాడు. డే 1 కలెక్షన్స్‌లో.. దాదాపు 250 కోట్లకు పైగా వసూలు చేసేలానే ఉన్నాడు.
02. kamal: తన లుక్స్‌తో థియేటర్లలో భూకంపం పుట్టిస్తోన్న కమల్.
కల్కి మూవీలో భైరవ, అశ్వథామ ఒకెత్తు అయితే.. యాస్కిన్గా చేసిన కమల్ క్యారెక్టర్ మరొక ఎత్తు అనేలా ఉంది. దానికితోడు కమల్ లుక్ .. అండ్ యాక్టింగ్.. సినిమా చూస్తున్న ఆడియెన్స్‌ను వణికిస్తోంది. థియేటర్లలో భూకంపం పుట్టిస్తోంది.
03.kalki: కల్కి సినిమాకు బిగ్ ఝలక్!
కొందరు నెటిజన్స్ అండ్ స్పాయిలర్స్ కారణంగా కల్కి సినిమాకు బిగ్ ఝలక్ తగులుతోంది. ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు వెళ్లిన కొంత మంది.. మూవీని చూడకుండా.. మూవీలోని ముఖ్యమైన సీన్లను తమ ఫోన్లో షూట్ చేసి.. నెట్టింట లీక్ చేయడం ఇప్పుడు.. కల్కి మూవీ టీంకు బిగ్ ఇష్యూగా మారింది. దానికి తోడు ఈ స్పాయిలర్ నెటిజన్స్ కారణంగా.. కల్కి సినిమాపై ఇంట్రెస్ట్ పోతుందనే కామెంట్ కొంతమంది రెబల్ ఫ్యాన్స్ నుంచి సీరియస్‌గా వస్తోంది.
04. kalki: హాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కల్కి హిట్ టాక్
కామీకాన్ ఈవెంట్‌తో.. హాలీవుడ్‌లో మొదలైన కల్కి హవా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకు ప్రీ టికెట్ సేల్‌తో.. ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేసిన కల్కి మూవీ… ఆఫ్టర్ రిలీజ్ కూడా ఆ కలెక్షన్స్‌నే కంటిన్యూ చేస్తోంది. ఓవర్సీస్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో.. పాటే డాలర్లు కురిపిస్తోంది.
05.prabhas: ప్రభాస్ పేరు మార్చిన డైరెక్టర్ నాగి
ప్రభాస్ ను ముద్దుగా డార్లింగ్ అంటారు. కాస్త గట్టిగా రెబల్ స్టార్ అంటారు. కానీ నెటిజన్స్ మాత్రం.. ప్ర – బాస్ అంటున్నారు. ఇదే ట్యాగ్‌ను ఆఫ్టర్ కల్కి బాక్సాఫీస్ ర్యాంపేజ్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ను భిన్నంగా కల్కి మూవీ డైరెక్టర్ నాగీ మాత్రం.. ప్రభాస్‌ను .. శ్రీ ప్రభాస్ అంటూ.. తన మూవీ టైటిల్ కార్డ్లో కోట్ చేశాడు. దీంతో నాగీ.. ప్రభాస్ పేరు మార్చాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు ఈయన.
06.darshan: దర్శన్‌కు సిగరెట్.. పవిత్రకు మేకప్.. వీళ్లు మారరిక..!
ఓ పక్క రేణుకా స్వామి దారుణ హత్యతో దర్శన్, పవిత్రపై విమర్శలు వస్తున్న వేళ.. జైళ్లో మారని వీరి తీరు.. జనాల్లో మరింత అసహ్యం పెరిగేలా చేస్తోంది. వీరిపై మరింత దారుణ విమర్శలు వచ్చేలా చేస్తోంది. ఎస్ ! రేణుకా స్వామిని మర్డర్ చేశారన్న ఆరోపణలపై జైల్లో ఉన్న వీరు పశ్చాత్తాపం పడాల్సింది పోయి… దర్శన్ సిగరెట్ల కోసం జైల్లో పోలీసులను రిక్వెస్ట్ చేస్తూ ఇరిటేట్ చేస్తున్నారట. ఇక మరో పక్క పవిత్రేమో.. మేకప్ వేసుకోనిదే బయటికి రావడం లేదట. అయితే వీరిద్దరి తీరు ఇప్పుడు కన్నడ నాట వైరల్ అవుతోంది. వీళ్లు ఇక మారరా? అనే కామెంట్ కన్నడిగుల నుంచి వస్తోంది.
07.kalki: కర్ణుడు.. భైరవుడు.. రెండు రోల్స్‌లో అదరగొట్టిన ప్రభాస్.
కల్కి సినిమా రిలీజ్ అయింది. దిమ్మదిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజాను అందించింది. ఎస్ ! ఈ మూవీలో ప్రభాస్ సూపర్ హీరో బైరవుడిగా కనిపించడం అందరికీ కిక్కిచ్చింది. దాంతో పాటే ఈ మూవీ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కర్ణుడిగా కూడా ప్రభాసే కనిపించడం… ఈ సినిమా చూస్తున్నవారిలో గూస్ బంప్స్ పుట్టించింది. సర్‌ప్రైజ్ అయ్యేలా చేసింది.
08.kalki: గ్రేట్ ! కల్కి ప్రొడ్యూసర్‌కు పెద్ద సాయం చేసిన ప్రభాస్.
కల్కి సినిమా కోసం టైంను.. భారీగా డేట్స్‌ను.. తన బాడీ అండ్ సోల్‌ను మాత్రమే కాదు.. రెమ్యూనరేషన్లో సగాన్ని కూడా ఇచ్చేశారట ప్రభాస్. ఎస్ ! దాదాపు 600కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కి మూవీ తెరకెక్కుతుండడంతో.. ప్రభాస్ తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్నారట. రెగ్యులర్‌గా ఒక్కో సినిమాకు తీసుకునే 150 కోట్లు కాకుండా.. 80 కోట్లకే పరిమితం అయ్యారట. ప్రొడ్యూసర్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ టాక్
09.kalki: నెట్టింట ట్రెండ్ అవుతున్న నాగి చెప్పులు
సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాలో… ఇప్పుడు కల్కి మూవీతో పాటు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పులు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్ కల్కి మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లో రన్ అవుతున్న వేళ.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టా స్టేటస్‌లో.. తను వాడి పూర్తిగా పాడై పోయిన చెప్పుల ఫోటోను పోస్ట్ చేశాడు. ఇట్స్ బీన్ ఎ లాంగ్ రోడ్ అంటూ.. ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడీ స్టేటస్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.