Teja Sajja – Hanuman: విజృంభిస్తున్న హనుమాన్.. 250 కోట్ల దాటిన కలెక్షన్స్.
హనుమాన్ దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సూపర్ హీరో మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మరో అరుదైన ఫీట్‌ను అందుకుంది హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈమూవీ తాజాగా 250 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. గణతంత్ర దినోత్సవం కావడంతో జనవరి 26 హనుమాన్ వసూళ్లు మరింత పెరిగాయి.
హనుమాన్ దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సూపర్ హీరో మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మరో అరుదైన ఫీట్‌ను అందుకుంది హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈమూవీ తాజాగా 250 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. గణతంత్ర దినోత్సవం కావడంతో జనవరి 26 హనుమాన్ వసూళ్లు మరింత పెరిగాయి. అందుకే కేవలం 15 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లు దాటేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా 250 కోట్ల పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇప్పట్లో రవితేజ ఈగల్ తప్ప మరే పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. సో.. రాబోయే రోజుల్లో హనుమాన్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో మెరిసింది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెరిశాడు. సముద్ర ఖని, జబర్దస్త్ శీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక హనుమాన్ సినిమాకు అమ్ముడైన ప్రతి టికెట్‌పై 5 రామ మందిరానికి విరాళంగా అందుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇటీవల 2.66 కోట్ల రూపాయాలను రామ మందిర నిర్మాణానికి విరాళంగా అందజేసింది. అలాగే తమ సినిమాకు నార్త్‌లోనూ ఊహించని స్పందన వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

