AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Property: హీరోయిన్ శ్రీదేవి ఆస్తి మాదే.. కోర్టుకెక్కిన ముగ్గురు వ్యక్తులు..

Sridevi Property: హీరోయిన్ శ్రీదేవి ఆస్తి మాదే.. కోర్టుకెక్కిన ముగ్గురు వ్యక్తులు..

Shaik Madar Saheb
|

Updated on: Aug 27, 2025 | 4:13 PM

Share

దివంగత నటి శ్రీదేవి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అగ్ర నటిగా రాణించారు. ఆమె తన జీవితంలో ఎన్నో స్థిరాస్తిలను కొనుగోలు చేశారు. ఆమె మరణానంతరం భర్త బోనీకపూర్, కూతుళ్ళు జాన్వీ, కుషీకి ఆస్తిలపై అధికారం ఉంది. తాజాగా చెన్నైలోని ఒక స్థలం విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది.

దివంగత నటి శ్రీదేవి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అగ్ర నటిగా రాణించారు. ఆమె తన జీవితంలో ఎన్నో స్థిరాస్తిలను కొనుగోలు చేశారు. ఆమె మరణానంతరం భర్త బోనీకపూర్, కూతుళ్ళు జాన్వీ, కుషీకి ఆస్తిలపై అధికారం ఉంది. తాజాగా చెన్నైలోని ఒక స్థలం విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది. 1988లో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో శ్రీదేవి ఒక స్థలాన్ని సంబంధ ముదలియార్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. అప్పట్లో ముదలియార్ కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్ళు ఉండగా వారి సమ్మతితోనే ఈ ఆస్తి శ్రీదేవి పేరుకు మారింది. అందులో ఫామ్ హౌస్ కట్టారు శ్రీదేవి. తాజాగా ముగ్గురు వ్యక్తులు తాము ముదలియార్ రెండో భార్య పిల్లలం అంటూ ముందుకు వచ్చారు. ఆ ఆస్తిపై హక్కు తమదని చెబుతూ ఆ ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన బోనీకపూర్ ఏప్రిల్ నెలలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్ ప్రకారం ముదలియార్ రెండో భార్యను 1975లో వివాహం చేసుకున్నారు. అయితే ముదలియార్ మొదటి భార్య మాత్రం 1999లోనే మృతి చెందింది. అంటే మొదటి భార్య బతికే ఉన్న సమయంలో రెండో వివాహం జరగడం వలన హిందూ వారసత్వ చట్టం ప్రకారం రెండో భార్య పిల్లలు చట్టబద్ధ వారసులుగా గుర్తింపు పొందలేరని కోర్టు స్పష్టం చేసింది.
ఈ ముగ్గురు వ్యక్తులు తాంబరం తాలూకా తహసీల్దార్ వద్ద నుంచి వారసత్వ ధృవీకరణ పత్రాన్ని పొందారు. కానీ అది మోసపూరితంగా పొందిన పత్రమని బోనీకపూర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తాంబరం తహసీల్దార్ ని ఆదేశించింది హైకోర్టు. అయితే ఈ ఆస్తి వివాదం ప్రస్తుతం తుది దశలో ఉంది. తహసీల్దార్ సమర్పించే నివేదిక ఆధారంగా యాక్షన్ తీసుకోనున్నారు. బోనీకపూర్ వాదనకు బలం ఉండడంతో రెండో భార్య పిల్లలకు హక్కులు ఉండవని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

Published on: Aug 27, 2025 04:12 PM