చిరు రిజెక్ట్ చేసిన కథతో జూ.ఎన్టీఆర్ సినిమా.. కట్ చేస్తే…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానముంది. కేవలం తన నటనతోనే కాకుండా డ్యాన్స్‌లతో సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసేశారు . అయితే చాలా మంది హీరోల్లాగే చిరంజీవి కెరీర్ లో మధ్యలో ఆగిపోయిన సినిమాలు, రిజెక్ట్ చేసిన మూవీస్ చాలానే ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మతో చెప్పాలని ఉంది, సింగీతం శ్రీనివాసరావుతో భూలోక వీరుడు, సురేష్ కృష్ణ దర్శకత్వంలో అబు తదితర సినిమాలు సెట్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. ఇదే క్రమంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన కొన్ని కథలతో ఇతర హీరోలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు. మరికొందరు బోల్తా పడ్డారు. చిరంజీవి, ఎన్టీఆర్ ల విషయంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది.
చిరంజీవి వద్దన్న సినిమాతో తారక్ ఓ సినిమా చేశాడు. రిలీజ్ కు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఆ మూవీ తీరా రిలీజయ్యాక డిజాస్టర్ గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ ఏదనుకుంటున్నారా? పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలా. అప్పట్లో ఈ సినిమా క్రేజ్ మాములుగా లేదు. కేవలం మూవీ ఆడియో ఫంక్షన్ కే లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. అప్పుడే కాదు ఇప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంది. ఇలా అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఆంధ్రావాలా ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా కథను మొదట చిరంజీవికే చెప్పారట పూరి జగన్నాథ్. అయితే అప్పటికే మెగాస్టార్ చేతిలో పలు సినిమాలు ఉండడంతో పూరి సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో డైరెక్టర్ ఎన్టీఆర్ కు కథ చెప్పి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించారు. సినిమా హిట్ కాకపోయినా ఇందులోని పాటలు మాత్రం ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తుంటాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఖైరతాబాద్ గణపతిని చూశారా?వీడియో
తాత నువ్వు కేక.! ఇలా కూడా వ్యాపారం చేయొచ్చా?వీడియో
కొడుకు ప్రాణాల కోసం.. మొసలితో తల్లి ఫైటింగ్ వీడియో
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
