Tollywood: తల్లికి రెండో పెళ్లి చేసిన 12 ఏళ్ల కూతురు.. వీడియో
తల్లీ కానీ, తండ్రి కానీ రెండో పెళ్లి చేసుకుంటానంటే చాలా మంది పిల్లలు అంగీకరించరు. కానీ ఈ ప్రముఖ నటి పెళ్లికి తన 12 ఏళ్ల కూతురు తోడుగా నిలిచింది. స్వయంగా తల్లిని పెళ్లి మండపానికి తీసుకొచ్చింది. ఇక తల్లి మెడలో మూడుముళ్లు పడుతున్నప్పుడు ఆ కూతురు ముఖంలో ఆనందం చూడాలి.. నెక్ట్స్ లెవెల్ అంతే. ఇలా 12 ఏళ్ల కూతురును పక్కన పెట్టుకుని రెండో పెళ్లి చేసుకున్నారు ఓ నటి.
ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పర్సనల్ లైఫ్ లో ఫుల్ బిజీ అవుతున్నారు. అలాగే కొందరు పెళ్ళైన కొద్ది రోజులకే విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. మరికొందరు మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత కూడా రెండో పెళ్లి చేసుకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా మలయాళ నటి ఆర్య రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఆమె ప్రేమించిన వ్యక్తికి కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం. ఆర్యకు ఇప్పటికే వివాహమై 12 ఏళ్ల కూతురు ఉండగా పలు మనస్పర్ధలు తలెత్తడంతో భర్తతో విడాకులు తీసుకుంది. ఇక అప్పటినుంచి కోరియోగ్రాఫర్ శిబిన్ తో డేటింగ్ చేస్తోంది. మే నెలలో వీరిద్దరూ కలిసి ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఆగస్టు 21వ తేదీన ఏడు అడుగులతో ఒకటయ్యారు. ఇక ఈ పెళ్ళికి సంబంధించిన పనులన్ని ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా చూసుకుంది. తన తల్లిని మండపం వద్దకు స్వయంగా తీసుకొచ్చి తాళి కట్టే సమయంలో పక్కనే ఉంది. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం కాంగ్రాట్స్ చెబుతున్నారు.
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం
నది లేదు.. చుక్క వర్షం పడదు.. నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

