ఇన్స్టాలో ఓ హీరోయిన్ క్రేజీగా ఓ వ్యక్తిని ఫాలో అవుతుందంటే.. అతడితో ఫ్రెండ్ షిప్ మొదలెట్టిందని అర్థం.. కలిసి ఫోటోలు పెట్టి.. లవ్ ఎమోజీలతో ఆ ఫోటో కింది టెక్ట్స్ ను డెకరేట్ చేసిందంటే.. లవ్‌లో ఉందని అర్థం. రెస్టారెంట్లలో.. పార్టీల్లో కొన్ని క్లోజ్గా ఉన్న ఫోటోలు పెడితే డేటింగ్లో ఉన్నట్టు అర్థం. అదే అన్ ఫాలో కొట్టి.. తన లవర్తో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేస్తే.. మోహమాటం లేకుండా బ్రేకప్ చెప్పిందని అర్థం. హీరోయిన్ శృతి హాసన్ కూడా ఇప్పుడిదే చేసిందంటే.. ఆమె తన ప్రియుడికి బ్రేకప్ చెప్పి పక్కన పెట్టిందనే గా అర్థం. !