దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం

రేణుకాస్వామి హత్య కేసులో నిందితులందరికీ జ్యుడీషియల్ కస్టడీని మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. దీనికి సంబంధించి ఆగస్టు 28న న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే ఈ కేసులో మొదటి ముద్దాయి పవిత్ర గౌడ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా జరిగింది. విచారణ సందర్భంగా, బెయిల్‌ను వ్యతిరేకించిన ఎస్‌పీపీ ప్రసన్న కుమార్, రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలను కోర్టు ముందు ఉంచారు.

దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం

|

Updated on: Aug 30, 2024 | 3:11 PM

రేణుకాస్వామి హత్య కేసులో నిందితులందరికీ జ్యుడీషియల్ కస్టడీని మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. దీనికి సంబంధించి ఆగస్టు 28న న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అలాగే ఈ కేసులో మొదటి ముద్దాయి పవిత్ర గౌడ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా జరిగింది. విచారణ సందర్భంగా, బెయిల్‌ను వ్యతిరేకించిన ఎస్‌పీపీ ప్రసన్న కుమార్, రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలను కోర్టు ముందు ఉంచారు. దీని ప్రకారం రేణుకా స్వామి నటి పవిత్రకు మెసేజ్ పంపగా, పవిత్ర గౌడ ఆ మొబైల్ నెంబర్‌ను నిందితుడు పవన్‌కు ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రేణుకా స్వామిని మభ్యపెట్టారు. ఆచూకీ తెలుసుకున్నారు. ఆ తర్వాత చిత్రదుర్గకు చెందిన రాఘవేంద్ర, వినయ్, జగ్గా, అను, రవి సాయంతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్

ఎన్నో చిక్కులు, ఇబ్బందులు.. హేమ కమిటీ రిపోర్ట్ పై సమంత రియాక్షన్..

Explainer: మగజాతి మనుగడకే ముప్పు పొంచి ఉందా ??

TOP 9 ET News: అల్లు అర్జున్ తికమక – మకతిక | రూ.120 కోట్లు… లేదంటే నో..!

Follow us