హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్

హేమ కమిటీ రిపోర్ట్ మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమనే తలకిందులు చేసింది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ఈ నివేదికలో బయట పడటంతో ఇండస్ట్రీ మొత్తం కుదేలవుతోంది. ఈ కమిటీ నివేదిక దెబ్బకి 'అమ్మ' సంస్థ కార్యవర్గం మొత్తం రిజైన్ బాట పట్టింది. దానికితోడు.. ఈ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క మహిళా బాధితులు బయటికి వస్తుండడం.. ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. రిమైనింగ్ ఇండస్ట్రీస్‌లో ఉన్న సెలబ్రిటీలను.. సినిమా వాళ్లను షాకయ్యేలా రియాక్టయ్యేలా చేస్తోంది.

హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్

|

Updated on: Aug 30, 2024 | 3:09 PM

హేమ కమిటీ రిపోర్ట్ మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమనే తలకిందులు చేసింది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ఈ నివేదికలో బయట పడటంతో ఇండస్ట్రీ మొత్తం కుదేలవుతోంది. ఈ కమిటీ నివేదిక దెబ్బకి ‘అమ్మ’ సంస్థ కార్యవర్గం మొత్తం రిజైన్ బాట పట్టింది. దానికితోడు.. ఈ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క మహిళా బాధితులు బయటికి వస్తుండడం.. ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. రిమైనింగ్ ఇండస్ట్రీస్‌లో ఉన్న సెలబ్రిటీలను.. సినిమా వాళ్లను షాకయ్యేలా రియాక్టయ్యేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ పై హీరో విశాల్ తనదైన శైలిలో రియాక్టయ్యారు. కోలీవుడ్ లోనూ ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇంతకీ హీరో విశాల్ ఏం మాట్లాడారంటే..”హేమ కమిటీ రిపోర్ట్‌లోని విషయాలు చూసిన తర్వాత నేను షాకయ్యా. ఆడవాళ్లకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం నిజంగా బాధాకరం. సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తామని తప్పుగా ప్రవర్తించే వారిని వదిలిపెట్టకూడదు. తగిన బుద్ధి చెప్పాలి. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఆడవాళ్లు దైర్యంగా ఉండాలి. సినిమా అవకాశాల పేరుతో లైంగికంగా వేధించడానికి ప్రయత్నిస్తే చెంప చెళ్లుమనిపించాలి. కొంతమంది కేటుగాళ్ళు ఫేక్ ప్రొడక్షన్స్ పేర్లతో కోలీవుడ్‌లోనూ మహిళలను వేధిస్తున్నారని వార్తలు వచ్చాయి. కోలీవుడ్ లోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.. ఈమేరకు ఓ ప్లాన్ రెడీ చేస్తున్నాం అని విశాల్ అన్నారు.”

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్నో చిక్కులు, ఇబ్బందులు.. హేమ కమిటీ రిపోర్ట్ పై సమంత రియాక్షన్..

Explainer: మగజాతి మనుగడకే ముప్పు పొంచి ఉందా ??

TOP 9 ET News: అల్లు అర్జున్ తికమక – మకతిక | రూ.120 కోట్లు… లేదంటే నో..!

Follow us