Rajinikanth Biopic: రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్.. హీరో ఎవరంటే.!
బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రజినీకాంత్ నేడు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. ఇప్పుడీ జర్నీనే సినిమాగా తీసుకురానున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నా ఈ చిత్రాన్ని 2025లో ప్రారంభించనున్నారట.
బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రజినీకాంత్ నేడు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. ఇప్పుడీ జర్నీనే సినిమాగా తీసుకురానున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నా ఈ చిత్రాన్ని 2025లో ప్రారంభించనున్నారట. ఇందులో రజనీకాంత్‌గా తమిళ స్టార్ హీరో ధనుష్ నటించే అవకాశమున్నట్లు సమాచారం. ఇటీవల సాజిద్ పెట్టిన ఓ పోస్ట్ దీనికి మరింత బలాన్నిస్తోంది. రజనీతో దిగిన ఫొటోను షేర్ చేసిన ఆయన.. ‘లెజెండరీ సినిమా కోసం పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. జీవితంలో మర్చిపోలేని ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాం. వేచి ఉండండి’ అని రాశారు. దీంతో ఆయన ఈ బయోపిక్ గురించే చెప్పారని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రజనీ వ్యక్తిగత జీవితంలోని విషయాలతో పాటు సినిమాల్లోకి వచ్చాక జరిగిన ముఖ్య సంఘటనలను కూడా చూపనున్నారని టాక్
కేవలం రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. స్టైల్‌కే కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రజనీకాంత్ ప్రస్తుతం యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చేస్తున్నారు. తెలుగులో ‘వేటగాడు’ పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో రజనీ నటిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

