Razakar: రజాకార్ ట్రైలర్ వివాదం తీవ్ర స్థాయికి చేరనుందా ?? అసలు రచ్చకు కారణమేంటంటే ??

Razakar: రజాకార్ ట్రైలర్ వివాదం తీవ్ర స్థాయికి చేరనుందా ?? అసలు రచ్చకు కారణమేంటంటే ??

Phani CH

|

Updated on: Feb 16, 2024 | 10:13 AM

కాంట్రవర్సీ కథలకు డిమాండ్ బాగా పెరిగింది.. అందుకే దర్శక నిర్మాతలంతా అటు వైపు పరుగులు పెడుతున్నారా..? చరిత్రలో దాగున్న నిజాల్ని నిర్భయంగా బయటికి తీయడానికి కారణం కూడా అదేనా..? విషయం ఎంత వివాదంగా ఉంటే.. విజయం కూడా అంతే బలంగా ఉంటుందని నమ్ముతున్నారా..? తాజాగా రజాకార్ ట్రైలర్ చూస్తుంటే ఈ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది అందరికీ..! వివాదాస్పద కథలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగిపోయింది.

కాంట్రవర్సీ కథలకు డిమాండ్ బాగా పెరిగింది.. అందుకే దర్శక నిర్మాతలంతా అటు వైపు పరుగులు పెడుతున్నారా..? చరిత్రలో దాగున్న నిజాల్ని నిర్భయంగా బయటికి తీయడానికి కారణం కూడా అదేనా..? విషయం ఎంత వివాదంగా ఉంటే.. విజయం కూడా అంతే బలంగా ఉంటుందని నమ్ముతున్నారా..? తాజాగా రజాకార్ ట్రైలర్ చూస్తుంటే ఈ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది అందరికీ..! వివాదాస్పద కథలకు ఈ మధ్య గిరాకీ బాగా పెరిగిపోయింది. 20 కోట్ల లోపు బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు కూడా 200 నుంచి 400 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అయితే ఇందులో విజయంతో పాటు వివాదం కూడా అంతే ఉంటుంది. అది తెలిసే అడుగులేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి సినిమాలు ఇలా వచ్చి.. సంచలనం సృష్టించనవే.కాశ్మీర్ ఫైల్స్ విడుదలైనపుడు.. అసలు అలాంటి సినిమా ఒకటి వచ్చిందనే విషయమే ఆడియన్స్‌కు ఐడియా లేదు. కశ్మీర్‌ పండిట్స్‌పై జరిగిన అకృత్యాలే ఈ సినిమా కథాంశంగా తీసుకొచ్చారు వివేక్ అగ్నిహోత్రి. అలాగే కేరళ స్టోరీ కూడా అంతే. చిన్న సినిమాగా వచ్చి 250 కోట్లు వసూలు చేసింది. తాజాగా రాజధాని ఫైల్స్,వ్యూహం లాంటి సినిమాలు కూడా వివాదాలే కేంద్రబిందువుగా వస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tillu Square: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్ ట్రైలర్

SSMB29: జక్కన్న భారీ స్కెచ్‌.. మహేష్‌ ఇక ఇంటర్నేషనల్‌ స్టార్ అవ్వాల్సిందే !!

హృతిక్‌కు యాక్సిడెంట్ !! యంగ్ టైగర్ సినిమాపై ఎఫెక్ట్ ??

Dunki: చడీచప్పుడు కాకుండా OTTలో రికార్డులు బద్దలు కొడుతున్న షారుఖ్ సినిమా..

Oy: అప్పుడు ఫట్టు.. ఇప్పుడు హిట్టు.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్