AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni: ఒక్క రాత్రిలో జీరోకు వచ్చేశాం.. కానీ ఆ తరువాత..

Ram Pothineni: ఒక్క రాత్రిలో జీరోకు వచ్చేశాం.. కానీ ఆ తరువాత..

Phani CH
|

Updated on: Oct 22, 2025 | 3:57 PM

Share

ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఎనర్జిటిక్‌గా ఉండే హీరో రామ్‌ పోతినేని. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నాడు. తన కుటుంబ నేపథ్యం గురించి చాలా మందికి తెలియని విషయాలు షేర్‌ చేసాడు. నాన్న తరపు వాళ్లది విజయవాడ అని, తాను హైదరాబాద్‌లో అమ్మమ్మ గారింట్లో పుట్టానని చెప్పుకొచ్చాడు.

1988లో విజయవాడలో జరిగిన కుల ఘర్షణల సమయంలో.. తమ కుటుంబం అప్పటివరకు సంపాదించిందంతా కోల్పోవడంతో ఒక్క రాత్రిలో జీరోకు వచ్చేశామనీ చెప్పాడు. ఆపై.. విజయవాడలో ఉండలేక.. తమ కుటుంబం చెన్నై చేరిందని, అక్కడి నుంచి తమ కుటుంబం కొత్త ప్రయాణం మొదలైందని వెల్లడించాడు. కింద నుంచి కష్టపడి ఒక స్థాయికి రావడం వేరు.. కానీ, అంత కష్టపడి పైకి వచ్చాక మొత్తం కోల్పోయి మళ్లీ ప్రారంభించడం వేరు అన్నాడు రామ్ పోతినేని. తన తండ్రి జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారనీ అందుకే ఆయనంటే తనకు చాలా గౌరవమనీ అన్నాడు. ఎంత కోల్పోయామనే దానికి ఆయనే ఉదాహరణ అని చెప్పాడు. విజయవాడలో తన బాల్యంలో కేవలం తన బొమ్మల కోసమే పెద్ద గది ఉండేదని, కానీ మద్రాసు వెళ్లాక.. తమ ఇల్లు మొత్తం కలిపినా.. ఆ బొమ్మల గదిలో సగమైనా లేదని వివరించాడు. అన్ని కష్టాలు ఎదురైనా.. తన తండ్రి ధైర్యంగా ముందుకే సాగారన్నారు. తనకు కొత్త ప్రదేశాలు చూడటం ఇష్టమని.. అందుకే గ్యాప్ దొరికితే ఫోన్ కూడా పక్కన పడేసి.. అలాంటి చోటుకు వెళ్లి కొన్ని రోజులు గడుపుతానని రామ్ చెప్పుకొచ్చాడు. కొత్త ప్రదేశాల్లో.. పరిచయం లేని వ్యక్తులను కలవటం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని, అక్కడే మన నిజమైన విలువేంటో మనకు తెలిసి వస్తుందని రామ్ అభిప్రాయపడ్డాడు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. తనను తాను స్టూడెంట్‌ను అని చెప్పుకుని, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని రామ్ తెలిపాడు. ‘దేవదాసు’ సినిమా విడుదలై హిట్ అయ్యాక.. ఇకపై తీసే ప్రతి సినిమానూ మొదటి సినిమానే అనుకో .. అంటూ చిరంజీవి తనకు ఒక సలహా ఇచ్చారని రామ్ వెల్లడించాడు. ‘దేవదాసు’ చూడడానికి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ను పరిచయం చేశారనీ ఆ సమయంలో తనకు కూడా సినీ నేపథ్యం ఉంటే బాగుండేది అనిపించిందని రామ్ ఆ నాటి అనుభవాన్ని వివరించాడు. అయితే.. సినీ నేపథ్యం ఉంటే సక్సెస్ విషయంలో చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ తర్వాత తెలిసిందని రామ్‌ పోతినేని పంచుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ కూతురు జైల్లో ఉంది.. ఫేక్ కాల్‌ను తిప్పికొట్టిన తండ్రి

సంక్రాంతి బరిలో పెరుగుతున్న పోటీ.. రేసులో ఉన్న సినిమాలేంటి ??

ఏఏ 22 ఎందుకంత స్పెషల్‌ ?? హాలీవుడ్ స్థాయిలో బజ్‌

కొత్త దారిలో స్టార్ వారసులు.. దర్శకులుగా మారుతున్న స్టార్ కిడ్స్‌

యాక్షన్‌ మోడ్‌లో గ్లామర్ క్వీన్స్‌.. రూటు మారుస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు