మీ కూతురు జైల్లో ఉంది.. ఫేక్ కాల్‌ను తిప్పికొట్టిన తండ్రి
సైబర్ నేరగాళ్ల మోసాన్ని పసిగట్టి తిప్పి కొట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో జరిగింది. గ్రామానికి చెందిన చిరు వ్యాపారి శ్రీనివాసరావు కుమార్తె బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుంది. ఆమె వివరాలు సేకరించిన నేరగాళ్లు తండ్రి శ్రీనివాస్‌కు ఫోన్ చేశారు. బెంగళూరు పోలీస్ స్టేషన్‌ను నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ కుమార్తె స్టేషన్లో మా అదుపులో ఉంది.
కేసులు లేకుండా చేయాలంటే వెంటనే రూ. 5 లక్షలు ఆన్‌లైన్లో పంపాలంటూ డిమాండ్ చేశారు. దీపావళి సెలవులకు వచ్చిన కుమార్తె ఇంట్లోనే ఉండటంతో ఫేక్ కాల్ అని గ్రహించిన శ్రీనివాస్.. మీపై కేసు పెడతాను అనగానే కాలర్ వెంటనే ఫోన్ కట్ చేశాడు. దీపావళి సెలవులకు వచ్చిన కుమార్తె ఇంట్లో తన ముందే ఉండబట్టి సరిపోయిందని, ఆమె బెంగళూరులో ఉండి ఉంటే.. తామంతా కంగారు పడి ఉండేవాడినని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఎస్సై భార్గవ్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. కొత్త ఫోన్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించవద్దన్నారు. అనుమానం వస్తే తమను సంప్రదించాలని చెప్పారు. ఇలాంటి ఫోన్లు వచ్చినప్పుడు.. ఎవరూ ఆందోళనతో డబ్బులు పంపవద్దని, ముందుగా కుటుంబసభ్యులతో లేదా అధికారిక దౌత్య మార్గాల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలని సూచించారు. అలాగే, ఇతరుల వాట్సాప్ కాల్స్, లింకులు నమ్మకూడదని, బ్యాంక్ వివరాలు పంచకూడదని, మోసాలు జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్సై తెలిపారు. నేరగాళ్లు కుటుంబ సభ్యుల వివరాలు కనుక్కుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పౌరులను కోరారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువగా అవుతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్ల చేతుల్లో రోజూ ఎంతో మంది మోసపోతున్నారు. రూ.10 వేల విలువైన వస్తువు రూ.5 వేలకే ఇస్తామని దీపావళి ఆఫర్లంటూ ‘తక్కువ ధర’ పేరుతో ఆన్‌లైన్లో ఎర వేస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్, సోషల్ మీడియాలో అలాంటి ప్రకటనలను గుప్పిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. అలాంటి ప్రకటనలను నమ్మి సంప్రదిస్తే మోసపోయినట్టేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతి బరిలో పెరుగుతున్న పోటీ.. రేసులో ఉన్న సినిమాలేంటి ??
ఏఏ 22 ఎందుకంత స్పెషల్ ?? హాలీవుడ్ స్థాయిలో బజ్
కొత్త దారిలో స్టార్ వారసులు.. దర్శకులుగా మారుతున్న స్టార్ కిడ్స్
యాక్షన్ మోడ్‌లో గ్లామర్ క్వీన్స్.. రూటు మారుస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు
దీపావళి బరిలోకి దూసుకెళ్తున్న సినిమాలు.. గెలుపు ఎవరిదో తెలుసా ??
ఇదేందిది.. ఇంటిపైన కొబ్బరిచెట్టా..!
వీడు మనిషి కాదు.. మహానుభావుడు బాస్.. అలా ఎలా పట్టేసాడు
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం ? వీడియో

