Ram Charan: టిల్లు స్క్వేర్’ సినిమాపై రామ్‌చరణ్‌ కామెంట్స్.! వీడియో.

Ram Charan: టిల్లు స్క్వేర్’ సినిమాపై రామ్‌చరణ్‌ కామెంట్స్.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Apr 09, 2024 | 9:30 PM

గతంలో డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధూ..ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతోంది. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరువలో ఉంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ. 96 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు టిల్లు స్క్వేర్ సినిమాపై సినీ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

గతంలో డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధూ..ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతోంది. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరువలో ఉంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ. 96 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు టిల్లు స్క్వేర్ సినిమాపై సినీ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈమూవీ సక్సెస్ కావడంతో టిల్లు స్క్వేర్ మూవీ టీమ్‌కు సక్సెస్ పార్టీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాగే టిల్లు స్క్వేర్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సైతం రివ్యూ ఇచ్చారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టిల్లు స్క్వేర్ మూవీ టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. తన ట్విట్టర్ ఖాతాలో సిద్దూ మూవీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. డియర్ సిద్ధూ.. నీ విజయాన్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్నందుకు మల్లిక్ రామ్, అనుపమ, మ్యూజిక్ డైరెక్టర్స్, సితార ఎంటర్టైన్మంట్స్ టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు చరణ్. చెర్రీ ట్వీట్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ..ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..