Rajinikanth: ఏ హీరో నాకు పోటీ కాదు.! కోలీవుడ్‌ను షేక్ చేస్తున్న రజినీ కామెంట్స్..
సుధీర్ఘ విరామం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథిపాత్రలో కనిపించిన సినిమా లాల్ సలామ్. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మొయిదీన్ భాయ్ అనే ముస్లిం వ్యక్తి పాత్రలో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో పాల్గొన్న రజినీ..
సుధీర్ఘ విరామం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథిపాత్రలో కనిపించిన సినిమా లాల్ సలామ్. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మొయిదీన్ భాయ్ అనే ముస్లిం వ్యక్తి పాత్రలో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో పాల్గొన్న రజినీ.. ఇటీవల కొంతకాలంగా తనపై వస్తున్న ట్రోలింగ్స్, విమర్శలపై రియాక్టయ్యారు. తాను ఏ హీరోను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. ఇండస్ట్రీలో తను ఎవరికీ పోటీ కాదని.. తనకు తానే పోటీ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జైలర్ సినిమా ఈవెంట్లో తాను చేసిన కామెంట్స్ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు రజినీ కాంత్.
జైలర్ ఈవెంట్లో ‘అర్థమైందా రాజా’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని వైరల్ చేశారన్నారు. తాను చెప్పిన మాటలను విజయ్ దళపతిపై కావాలనే తాను మాట్లాడినట్లు ప్రచారం చేశారన్నారు. అయితే విషయం తన వరకు రావడంతో.. చాలా బాధ అనిపించిందని.. అన్నారు రజినీ. చిన్నప్పటి నుంచి విజయ్ ను తాను చూస్తున్నానని.. తన కళ్ల ముందే పెరిగాడన్నారు. ఎంతో పట్టుదలతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై తానెందుకు కామెంట్స్ చేస్తాను అంటూ మీమ్స్ అండ్ ట్రోల్స్ చేసే వారిని ప్రశ్నించారు. ఫైనల్‌గా… తనకు ఎవరితో పోటీ పడనని.. తనకు తానే పోటిగా ఉంటానని తన స్టైల్లో చెప్పారు రజినీ. అంతేకాదు తమ ఇద్దరిని పోల్చీ చూడడం మానండంటూ.. ఫిల్మ్ లవర్స్‌కు.. చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

