సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముదుకు రాబోతున్నారు. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా చెన్నైలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఫంక్షన్లో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్’ అనే ట్యాగ్ తనకు ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉందన్నారు.
జైలర్ సినిమాలోని హుకుమ్ అనే పాటను మొదటిసారి విన్నప్పుడు ఎంతో ఇష్టపడ్డానన్నారు. అందుకే పాట వీడియో నుంచి సూపర్ స్టార్ అనే ట్యాగ్‌ను తీసివేయాలని సినిమా మేకర్స్‌ను కోరారు రజనీకాంత్. ఆ ట్యాగ్ తనకు ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉందన్నారు. ఇందుకు సంబంధించిన రజనీకాంత్ స్పీచ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇక గతంలో తాను తెలియక చేసుకున్న మద్యం అలవాటు.. ఆరోగ్యం, ఆనందం రెండింటిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అభిమానులకు రజనీ విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...