Dude: మరీ బోల్డ్ నెస్ ఎక్కువైపోయింది! హిట్టా..? ఫట్టా..?
లవ్ టుడే, డ్రాగన్ సినిమాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన సినిమా డ్యూడ్. చాలా బోల్డ్ కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. గగన్ అలియాస్ ప్రదీప్ రంగనాథన్, కుందన అలియాస్ మమితా బైజు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. బావ మరదళ్లు కూడా. కుందన తండ్రి పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు అలియాస్ శరత్ కుమార్.
ఓ సమయంలో తన మరదలి ప్రేమను గగన్ రిజెక్ట్ చేస్తాడు. దాంతో ఆమె పై చదువుల కోసం వేరే దగ్గరికి వెళ్లిపోతుంది. అలా వెళ్లిన తర్వాత అక్కడ ఒకర్ని ప్రేమిస్తుంది కుందన. కానీ కొన్ని రోజుల తర్వాత కుందనను ప్రేమిస్తున్నానని తెలుసుకుంటాడు గగన్. ఆ తర్వాత ఏం జరిగింది..? గగన్, కుందన పెళ్లి చేసుకున్నారా లేదా..? చేసుకుంటే వాళ్ల రిలేషన్ ఏమైంది..? కుందన ఎవర్ని ప్రేమించింది అనేది అసలు కథ. చిన్నప్పటి నుంచి స్నేహితులు..! ఒకరి మీద మరొకరికి ప్రేమ.. కానీ అది ఒకేసారి కాదు రెండు వేర్వేరు సార్లు రావడం..! ఇవన్నీ చాలా సినిమాల్లో చూసాం కదా. ఇప్పుడు డ్యూడ్ కూడా ఈ తరహా కథే, కాకపోతే ఇందులో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ చెప్పాడు దర్శకుడు కీర్తిశ్వరన్. కానీ డ్యూడ్ చూసాక ఒక కంప్లీట్ ఫీలింగ్ వస్తుందా అంటే.. రాదనే చెప్పాలి. గతంలో కన్యాదానం లాంటి సినిమాలలో ఈ తరహా కథలు వచ్చాయి. అయితే డ్యూడ్ సినిమాలో చెప్పింది మాత్రం అంతకుమించి ఉంది. ఫస్టాఫ్ వరకు నో కంప్లైంట్స్.. సినిమా అదిరిపోయింది. రాకెట్ స్పీడ్ లో వెళ్లిపోయింది. సెకండ్ హాఫ్ లోనే అసలు ట్విస్ట్ వచ్చింది. ఆ మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథతో డిస్ కనెక్ట్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి… కానీ మెయిన్ స్టోరీ నంచి పక్కకు జరగడం మూలానో ఏమో కానీ సినిమా ఎటో వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగని డ్యూడ్ బాగోలేదని కాదు కానీ.. కొందరికి నచ్చడం కష్టం. ఇంకా చెప్పాలంటే డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టమే. ఇలాంటి కథలకు కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.. ఎందుకంటే రియాలిటీ బయట ఇలాగే ఉంది కాబట్టి.. పరువు హత్య కాన్సెప్ట్ జెన్ జీ స్టైల్ లో తీయడం దర్శకుడు కీర్తిశ్వరన్ గొప్ప విషయమే. సెన్సిటివ్ పాయింట్స్ ఇందులో డీల్ చేశాడు.. క్లైమాక్స్ ఇంకాస్త బెటర్‌గా తీసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ చాలా బాగా నటించాడు.. మనోడిలో ధనుష్, రజినీకాంత్ ఇద్దరు మిక్స్ అయ్యారు. మమిత బైజు చాలా బాగా నటించింది.. మరో కీలక పాత్రలో శరత్ కుమార్ అదరగొట్టాడు. మరో కీలక పాత్రలో మలయాళ నటుడు హ్రిదు హరూన్ బాగున్నాడు. కమెడియన్ సత్య సైతం ఇందులో అలా కనిపించి మాయమయ్యాడు. అలాగే నేహా శెట్టి సైతం చిన్న పాత్ర చేసింది. ఇక సాయి అభ్యంకర్ సంగీతం ఈ చిత్రానికి మెయిన్ అట్రాక్షన్. పాటలు, మరీ ముఖ్యంగా ‘ఊరుమ్ బ్లడ్’ లాంటి ట్రాక్స్ చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. నేపథ్య సంగీతం కూడా చాలా సన్నివేశాలలో చక్కగా కుదిరింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. భరత్ విక్రమన్ ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో బాగున్నా.. సెకండాఫ్‌లో మాత్రం నిదానంగా అనిపించింది. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ సినిమాతో మంచి డెబ్యూ ఇచ్చాడని చెప్పవచ్చు. అతడు ఎంచుకున్న కథాంశం బాగుంది.. సమాజంలో జరిగేదే చూపించాడు కానీ మరీ బోల్డ్ నెస్ ఎక్కువైపోయింది. అది కనెక్ట్ అవుతుందా లేదా అంటే ఏం చెప్పలేం. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే డ్యూడ్.. ఇట్స్ జస్ట్ ఓకే డ్యూడ్..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??
అత్తామామలను రెండు పీకి.. కట్ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే
త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం
ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..
తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

