Watch Video: డబుల్ మీనింగ్ జోక్‌.! దెబ్బకు.. కమెడియన్ చెంపలు వాయగొట్టిన సింగర్.

Watch Video: డబుల్ మీనింగ్ జోక్‌.! దెబ్బకు.. కమెడియన్ చెంపలు వాయగొట్టిన సింగర్.

Anil kumar poka

|

Updated on: Mar 01, 2024 | 11:24 AM

అదొక లైవ్ టీవీ షో.. అందరూ కమెడియన్‌ జోకులకు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. చిట్ చాట్ షో.. సరదాగా సాగుతోంది. ఇంతలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న కమెడియన్ సింగర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. అంతే కోపంతో సివంగిలా ఊగిపోయిన సింగర్‌.. లైవ్‌లోనే కెమెరా ముందే కమెడియన్‌ను తిడుతూ రెండు చెంపలు వాయించింది. ఈ షాకింగ్‌ ఘటన దాయాది దేశం పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.

అదొక లైవ్ టీవీ షో.. అందరూ కమెడియన్‌ జోకులకు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. చిట్ చాట్ షో.. సరదాగా సాగుతోంది. ఇంతలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న కమెడియన్ సింగర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. అంతే కోపంతో సివంగిలా ఊగిపోయిన సింగర్‌.. లైవ్‌లోనే కెమెరా ముందే కమెడియన్‌ను తిడుతూ రెండు చెంపలు వాయించింది. ఈ షాకింగ్‌ ఘటన దాయాది దేశం పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలింతకీ ఏం జరిగిందంటే.! పాకిస్తాన్ దేశంలోని ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో ఎంటర్ టైన్‌మెంట్ లైవ్‌ షో నడుస్తోంది. ఈ షోకు పాక్‌ ఫేమస్‌ సింగర్ షాజియా మంజూరు, కామెడీ యాక్టర్ షెర్రీ నన్హా అతిధులుగా పాల్గొన్నారు. యాంకర్‌గా హైదర్ వ్యవహరిస్తున్నాడు. అప్పటి వరకు సరదాగా సాగిపోతున్న షోలో కామెడియన్‌ షెర్రీ.. సింగర్ షాజియాను ఉద్దేశిస్తూ ప్రాంక్ చేశాడు. అదే అతనిపాలిట పెను షాపమైంది.

షాజియా నువ్వు, నేనూ పెళ్లి చేసుకుని హనీమూన్‌కు వెళ్లాలనుకుంటే నేను మోంటో కార్లో తీసుకెళ్తాను. ఎలా వెళితే బాగుంటుంది అంటూ ప్రాంక్ చేశాడు. షెర్రీ వ్యాఖ్యలతో సింగర్ షాజియాకు తీవ్ర స్థాయిలో చిర్రెత్తుకొచ్చింది. థార్డ్‌ క్లాస్‌ రా.. అంటూ కమెడియన్‌ను పట్టుకుని రెండు చెంపలు వాయించింది. ఈ ఊహించని పరిణామానికి యాంకర్‌తోపాటు మొత్తం సెట్‌లో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. ప్రాంక్ అయితే మాత్రం ఇంత వల్గర్‌గా మాట్లాడుతావా.. నోటికి అడ్డూఅదుపు ఉండొద్దు. ప్రాంక్ అయితే మాత్రం విలువలు ఉండవా? మహిళలను ఏది పడితే అది అడుగుతారా? ఆడవాళ్లతో ఇలాగేనే మాట్లాడేది? అంటూ శివాలెత్తిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos