OG గన్స్ అండ్ రోజెస్‌తో.. సోషల్ మీడియాలో అగ్గి పుట్టిస్తున్న తమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న 'ఓజీ' సినిమా దసరాకి విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ‘ఓజీ’ చిత్రం నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
యూట్యూబ్లో ట్రెండ్ అవ్వడమే కాదు.. ఓజీ ఫ్యాన్స్‌లో నయా జోష్‌ను నింపేస్తోంది. ఓజీ ఫీవర్‌ను మరింత హైకి సెట్ చేసింది. సంగీత సంచలనం తమన్ ఓజీ సినిమాకు తన బ్లడ్ అండ్ స్వెట్‌ను ధారపోసి మరీ… దిమ్మతిరిగే మ్యూజిక్ సమకూర్చినట్టుగా సాంగ్స్ అండ్స్ థీమ్ మ్యూజిక్ చూస్తుంటే తెలుస్తోంది. తమన్ తన బీజీఎమ్‌తో ఈసారి థియేటర్లో అగ్ని తుఫాను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌ను షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఓజీ విడుదల కానుంది. దీంతో ప్రేక్షకుల్లో ఓజీ ఉత్సాహం రోజు రోజుకూ ఎక్కువవుతోంది. అంతేకాదు ఇప్పటికే పలు చోట్లు పవన్ అభిమానులు సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ట్రైలర్ కూడా త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది. సో పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ అనదర్ ఫైర్ స్ట్రామ్!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ తీరు నాకు నచ్చలేదు !! తెలుగు ట్రైలర్ పై నొచ్చుకున్న స్టార్ కమెడియన్
Hyderabad Rains: కుంభవృష్టితో వణికి పోయిన భాగ్యనగరం
SR Nagar: గాలివానకు కాలేజీ భవనంపై విరిగిపడిన భారీ వృక్షం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

