AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ తీరు నాకు నచ్చలేదు !! తెలుగు ట్రైలర్‌ పై నొచ్చుకున్న స్టార్ కమెడియన్

మీ తీరు నాకు నచ్చలేదు !! తెలుగు ట్రైలర్‌ పై నొచ్చుకున్న స్టార్ కమెడియన్

Phani CH
|

Updated on: Sep 18, 2025 | 7:45 PM

Share

VTV గణేష్! విజయ్ సేతుపతి బీస్ట్ సినిమాలోని ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్‌ అనే చిన్న డైలాగ్‌తో.. ఓవర్ నైట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈయన.. ఇప్పుడు అసహనానికి లోనయ్యారు. తన బలమే తన వాయిస్. పెక్యులర్‌గా ఉన్న తన వాయిస్‌ను కాదని.. తనకు తెలియకుండా.. మరొకరితో.. తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పించడమే ఇప్పుడు ఆయనకు కోపం తెప్పిచింది.

నేరుగా ఇదే విషయమై ప్రెస్ మీట్లో మాట్లాడేలా చేసింది. సతీష్ క్రిష్ణన్ డైరెక్షన్లో కెవిన్ ,ప్రీతి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా కిస్. తమిళ్లో తెరకెక్కిన ఈసినిమా తెలుగులోనూ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఇందులో VTV గణేష్ కూడా ఓ కీ రోల్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు ట్రైలర్‌లో.. వీటీవి గణేష్ రోల్‌కు.. తనతో కాకుండా.. మరొకరితో.. ఆయన వాయిస్‌ మాడ్యూల్లో డబ్బింగ్ చెప్పించారు. అయితే ఈ విషయాన్ని గమనించిన వీటీవీ గణేష్ కాస్త ఫీలయ్యారు. రీసెంట్‌గా ఈ మూవీ ప్రెస్ మీట్‌కు వచ్చిన ఆయన.. ఇదే విషయమై ఓపెన్‌గా మాట్లాడారు. నాకు తెలుగొచ్చు. రేపే డబ్బింగ్‌ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్‌ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, నాకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నాడు. అదే లేడీ డైరెక్టర్‌ అయ్యుంటే సరే, నేను చెక్‌ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది. మేల్‌ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు ఈయన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabad Rains: కుంభవృష్టితో వణికి పోయిన భాగ్యనగరం

SR Nagar: గాలివానకు కాలేజీ భవనంపై విరిగిపడిన భారీ వృక్షం

ఇళయరాజా దెబ్బకు.. అజిత్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్‌

Manchu Lakshmi: చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది..

మిరాయ్‌ డైరెక్టర్‌కు.. ప్రొడ్యూసర్‌ దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్