Manchu Lakshmi: చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది..
ఎంత పెద్ద సెలబ్రిటీలైనా.. రెండు చేతులా కోట్లలో సంపాదించే స్టార్స్ అయినా సరే.. ఆర్థిక క్రమ శిక్షణ లేకపోతే.. కష్టాల్లో కూరుకుపోడానికి పెద్ద టైమేమీ పట్టదు. ఇలాంటి పరిస్థితి కారణంగా మన పాత తరం హీరోలు.. హీరోయిన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు ... చాలా మంది తమ చివరి రోజుల్లో దుర్భర జీవితాన్ని అనుభవించారు. పట్టెడు అన్నంలేని పరిస్థితుల్లో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
అయితే.. ఈ నేపథ్యంలో… టాలీవుడ్ సీనియర్ నటి మంచు లక్ష్మి.. ఆర్థిక క్రమశిక్షణ గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వంశీ కృష్ణ మల్ల డైరెక్షన్‌లో… మంచు లక్ష్మి నిర్మిస్తూ.. లీడ్ చేస్తున్న సినిమా..‘దక్ష’. సెప్టెంబర్ 19 ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తన ఆర్థిక క్రమశిక్షణ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘చెప్పుకోడానికే సిగ్గుగా ఉంది…కానీ నిక్కచ్చిగా చెబుతున్నా.. నాకు పెద్దగా ఆర్థిక క్రమ శిక్షణ లేదు’ అని నిజాయితీగా అంగీకరించారు. తాను సంపాదించిందంతా.. టీచ్ ఫర్ చేంజ్ వంటి సామాజిక కార్యక్రమాలకే వినియోగిస్తున్నానని ఆమె వెల్లడించారు. అంతేకాదు.. తాను నటించిన సినిమాలకు.. ఆయా చిత్రాల నిర్మాతలు పారితోషికం ఎగ్గొట్టారని.. కానీ.. నిర్మాతగా తాను మాత్రం ఎవ్వరికీ డబ్బు ఎగ్గొట్టలేదని చెప్పుకొచ్చారు. ఇటీవల తాను నటించిన చివరి సినిమా డబ్బులూ ఆ నిర్మాత ఇంకా ఇవ్వనేలేదని వెల్లడించారు లక్ష్మి. ‘మనీ సంగతి అడిగితే.. వారి సినిమా కష్టాలన్నీ చెప్తారు. సరేలే, పాపం.. సినిమా ముందుకెళ్లాలి కదా అనుకుని మనమూ షూటింగ్ చేస్తాం..’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మిరాయ్ డైరెక్టర్‌కు.. ప్రొడ్యూసర్ దిమ్మతిరిగే సర్‌ప్రైజ్ గిఫ్ట్
Lokesh Kanagaraj: రజినీ – కమల్ కూడా పక్కన పెట్టేశారా ?? పాపం..లోకేష్!
Dil Raju: షార్ట్ ఫిల్మ్‌ల పోటీ.. గెలిస్తే రూ. 3 లక్షలు..
Manchu Manoj: మోహన్ బాబు కొడుకైతే ఏంటి? పాపం! మనోజ్‌కు ఇన్ని కష్టాలు.. కన్నీళ్లా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

