AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్‌ గది ఇదే.. నెట్టింట ఫుల్ ట్రెండ్

చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్‌ గది ఇదే.. నెట్టింట ఫుల్ ట్రెండ్

Phani CH
|

Updated on: Oct 28, 2025 | 12:54 PM

Share

కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారక రామారావు తెలుగువాడి వాడీ వేడిని.. ప్రపంచానికి చూపించారు. ఎన్టీయార్‌ గుంటూరులోని ఆంధ్రా క్రిష్టియన్ కాలేజ్ లో బీఏ చదివారు. గుంటూరులోని కన్నా వారి తోటలో ఓ ఇంటి డాబాపై రూమ్‌లో ఉండేవారు. అప్పటి రోజుల్లో సొంతూరు దాటి వెళ్లి రూంలో ఉంటూ చదువుకోవడం అంటే గొప్పే.

1940లో ఎన్టీఆర్ ఆంధ్రా క్రిష్టియన్ కాలేజ్ కాలేజ్ లో బిఏ చదివారు. అప్పుడు కన్నా వారి తోటలో ఉన్న ఒక ఇంటిలో పైన ఉన్న ఒక చిన్న గదిలో నివసించేవారు. ఆ ఇంటి నుంచి కాలేజ్ కు ప్రతి రోజూ నడిచి వెళ్లి వచ్చేవారని స్తానికులు తెలిపారు. మరో సినీ నటుడు ముక్కామల కూడా ఎన్టీఆర్ తో పాటు ఆ గదిలోనే ఉండేవారట. ఎన్టీఆర్ ఆ రూం బయట ప్రాంగణంలో స్నానం చేసేవారని అక్కడే బుడ్డి దీపం పెట్టుకుని చదివే వారని చెబుతారు. 85 ఏళ్ల నాటి ఆ గది ఇప్పటికీ అలాగే చెక్కు చెదర కుండా ఉంది. దీంతో కొంతమంది అభిమానులు అప్పుడప్పుడు ఆ గదిని చూడటానికి వస్తుంటారని స్థానికులు తెలిపారు. ఇక ఆ ఇంటి సమీపంలోనే మరో దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు బంధువులు నివసించేవారట. దాంతో ఎస్వీ రంగారావు బంధువుల ఇళ్లకు కన్నా వారి తోట వచ్చేవారట. ఆ జ్ఞాపకాలను స్థానికులు నెమరు వేసుకుంటుంటారు. ఎన్టీఆర్ బీఏ డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి సినీ నటుడిగా ఎదిగిన తర్వాత తాము ఉన్న రూం ఎలా ఉందంటూ స్నేహితులను అడిగేవారట. ఎనబై ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ ఆ గది అలానే ఉంది. దీంతో ఆయన అభిమానులు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ఆ గదిని చూసి వెళుతుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలీవుడ్‌లో హారర్‌ మూవీ, రామ్ గోపాల్ వర్మ బౌన్స్ బ్యాక్ అవుతారా

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే ??

ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

తరుముకొస్తున్న మొంథా తుఫాన్‌.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్

నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం