18 Pages Success Meet Live: ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో నిఖిల్.. 18 పేజేస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న టీం..(లైవ్)
ప్రజంట్ టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీడేస్‌తో కెరీర్ ఆరంభించి.. ఆపై హీరోగా మారి మంచి హిట్స్ అందుకుంటున్నాడు. మంచి మంచి కథలను చేసుకుంటూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్నాడు. కార్తీకేయ2 సినిమాతో.. పాన్ ఇండియా హిట్టు కొట్టి..
నిఖిల్ హీరోగా… పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ 18 పేజేస్. పాన్ ఇండియన్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ అందించారు. GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీ వాస్ నిర్మించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ వీకెండ్ రిలీజైన 18 పేజేస్ ఫస్ట్ డేనే… మంచి టాక్ తెచ్చుకుంది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ’18 పేజెస్’ మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి 2 రోజుల్లో రూ. 2.28 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 48 లక్షలు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ సినిమాకు రూ. 3.01 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.05 కోట్లు గ్రాస్ వసూలైంది. ఈ ఆదివారం ముగిసే సరికి మూవీ కలక్షన్స్ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. 18 పేజెస్‌కు వరల్డ్ వైడ్ రూ. 12.00 కోట్లు మేర బిజినెస్ జరిగిందట. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.50 కోట్లుగా ఉంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 3.01 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 9.49 కోట్లు రాబడితేనే ఈ సినిమా మంచి హిట్ అయినట్లు లెక్క.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..