Dhamaka: సక్సెస్ ఫుల్ ధమాకా.. మాస్ రాజా మూవీ మాస్ ఈవెంట్
త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం(డిసెంబర్ 23న) విడుదలైంది.
మాస్ మహా రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. చాలా రోజుల తర్వాత ఈ మూవీతో హిట్ అందుకున్నాడు రవితేజ. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం(డిసెంబర్ 23న) విడుదలైంది. రిలీజ్ అయినా అన్ని ఏరియాలనుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమాకు మొదటి షో నుంచే హిట్ టాక్ వచ్చేసింది. భీమ్స్ సిసిరోలియో ధమాకా సినిమాకు సంగీతం అందించారు.
Published on: Dec 29, 2022 07:41 PM
వైరల్ వీడియోలు
Latest Videos